amazon announced big deal on Samsung Smart Tv from GIF sale
Samsung Smart Tv పై ఈరోజు అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. శామ్సంగ్ ఇండియాలో అందించిన లేటెస్ట్ 4K Samsung Smart Tv సిరీస్ నుంచి వచ్చిన 43 ఇంచ్ టీవీ పై ఈ డీల్ ను అందించింది. ఈ ఆఫర్ ద్వారా ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ ఈరోజు 25 వేల రూపాయల బడ్జెట్ లోనే లభిస్తోంది. మంచి స్క్రీన్, ఫీచర్స్ మరియు సౌండ్ సపోర్ట్ కలిగిన ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ పై ఒక లుక్కేయండి.
శామ్సంగ్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ సిరీస్ UA43DUE70BKLXL నుంచి వచ్చిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. శామ్సంగ్ యొక్క ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి 38% డిస్కౌంట్ తో రూ. 27,990 ధరతో సేల్ అవుతోంది.
ఈ స్మార్ట్ టీవీని మరింత చవక ధరకు అందుకోవడానికి వీలుగా ఈ టీవీ తో మరో రెండు ఆఫర్లు అందించింది. ఈ స్మార్ట్ టీవీ పై రూ. 500 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు SBI కార్డ్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో రూ. 1,500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీని కేవలం రూ. 25,990 రూపాయలకు అందుకోవచ్చు. Buy From Here
Also Read: Gemini Live: తెలుగు తో సహా మొత్తం 9 భాషల్లో అందుబాటులోకి వచ్చిన జెమినీ లైవ్.!
ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ Crystal Processor 4K తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+, 4K అప్ స్కేలింగ్, UHD Dimming తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Bixby వాయిస్ రెడీ AI Speaker సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.
ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ 20W సౌండ్ అందించే స్పీకర్లు కలిగి వుంది. Q-Symphony, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ మరియు అడాప్టివ్ సౌండ్ సపోర్ట్ తో ఈ టీవీ గొప్ప సౌండ్ అందిస్తుంది. బడ్జెట్ ధరలో శామ్సంగ్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు ఈ టీవీ ఆఫర్ ను పరిశీలించవచ్చు.