వోడాఫోన్ యొక్క రూ. 509 ప్రీపెయిడ్ ప్లానుతో రోజువారీ 100MB అధిక డేటా

HIGHLIGHTS

వోడాఫోన్ వినియోగదారులు మొత్తంగా 9GB అధిక డేటా ప్రయోజనాన్ని పొందుతారు.

ప్రస్తుతం టెలికం రంగంలో నడుస్తున్న పోటీకి అణుగుణంగా, అన్ని సంస్థలు కూడా వాటి ప్లాన్లలో అంక మార్పులను చూస్తున్నాయి మరియు అనేక కొత్త ప్లాన్స్ కూడా పరిచయం చేస్తున్నాయి. అదేవిధంగా, ఇప్పుడు వోడాఫోన్ కూడా తన లాంగ్ టర్మ్ ప్లాన్ అయినటువంటి రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్ పైన ఇప్పుడు అధిక డేటాని ప్రకటించింది. ఇప్పుడు ప్రకటించిన ఈ అధిక డేటా ఆఫరుతో, వోడాఫోన్ వినియోగదారులు మొత్తంగా 9GB అధిక డేటా ప్రయోజనాన్ని పొందుతారు.

ముందుగా, వోడాఫోన్ యొక్క ఈ రూ. 509 ప్రీపెయిడ్ ప్లానుతో ఎటువంటి FUP పరిమితిలేని లోకల్ మరియు STD అపరిమిత కాలింగ్,రోజువారీ 1.4GB డేటా మరియు రోజువారీ 100SMS పరిమితితో పాటుగా 90 రోజుల వ్యాలిడిటీతో అందించింది. అయితే, ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ను సవరించి, వినియోగదారులకి రోజువారీ 100MB డేటాని అధికంగా అఫర్ చేస్తోంది. అంటే, ఇప్పుడు ఈ ప్లానుతో రోజువారీ 1.5GB డేటాని  అందుకుంటారు వినియోగదారులు.

ఇక పూతి వ్యాలిడిటీ అయినటువంటి 90 రోజులకు గాను లెక్కగడితే, 9GB డేటా ప్రయోజనాన్ని వినియోగదారులు అధికంగా అందుకుంటారు. అలాగే, ఉచిత LIVE టీవీ కి యాక్సెస్ అందుకుంటారు మరియు ఇంకా మరిన్ని ప్రయోజనాలను ఈ 509 రూపాయల ప్రీపెయిడ్ ప్లానుతో అందుకుంటారు. కానీ, వోడాఫోన్ యొక్క రూ. 511 ప్లాను దీనికి పోటీకి వచ్చే అవకాశం వుంది. ఎందుకంటే,  రూ. 511 ప్రీపెయిడ్ ప్లానుతో అన్లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100SMS లతో పాటుగా రోజువారీ 2GB డేటాని అఫర్ చేస్తోంది. అయితే, వ్యాలిడిటీ మాత్రమే 84 రోజులుగా ఉంటుంది.               

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :