కేవలం రూ. 9 ధరకే అన్లిమిటెడ్ బంపర్ ప్లాన్స్ తీసుకొచ్చిన Vodafone

HIGHLIGHTS

వోడాఫోన్ యొక్క ఈ అపరిమిత చిన్న ప్యాక్ ఎక్కువగా కాలింగ్ చేసే వినియోగదారులకు మంచిది.

వోడాఫోన్ ఐడియా ప్రస్తుతం చాలా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నా కూడా, తన సబ్ స్క్రైబర్లకు మాత్రం మంచి ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. రిలయన్స్ జియో గత కొద్దీ వారాలలో ఎంట్రీ లెవల్ చిన్న ప్లాన్లయిన రూ .19 మరియు రూ .52 ను వదిలివేసింది, అయితే, వోడాఫోన్ తన వినియోగదారుల కోసం కొత్తగా రూ .9 మరియు రూ .21 అన్లిమిటెడ్ చిన్న ప్యాక్స్ విడుదల చేసింది.

ఈ 9 మరియు 21 రూపాయల అపరిమిత చిన్న ప్యాక్లతో  పాటు, వొడాఫోన్‌లో డేటా ప్యాక్ అయినా 59 రూపాయలు ప్లాన్ కూడా వుంది.  ఇది ఏడు రోజుల పాటు రోజుకు 1GB డేటాను అందిస్తుంది. ఈ రూ .9, రూ .21 ప్యాక్‌ లు రెండు రోజుల పాటు వాయిస్ కాలింగ్, డేటా, ఎస్‌ఎంఎస్‌ వంటి లాభాలను అందిస్తాయి. వోడాఫోన్ యొక్క ఈ అపరిమిత చిన్న ప్యాక్ ఎక్కువగా కాలింగ్ చేసే వినియోగదారులకు మంచిది.

వొడాఫోన్ రూ 9 ప్లాన్ ఆఫర్లు

వోడాఫోన్ ప్రస్తుతం మూడు చిన్న ప్యాక్‌ లను కలిగి ఉంది మరియు వాటిలో మొదటిది ఇది ప్రారంభ ధర రూ .9తో ఉంటుంది. ఈ ప్లానులో మీరు, ఎటువంటి FUP పరిమితి లేకుండా అపరిమిత వాయిస్ కాలింగ్,  100 SMS మరియు 100 MB 4G / 3G / 2G డేటాను కేవలం ఒక రోజు పరిమితితో అందిస్తుంది. మిగిలిన టెలికం సంస్థలతో పోలిస్తే, మీరు ఈ ప్లానులో మంచి లాభాలను పొందవచ్చు.

వోడాఫోన్ రూ .21 ప్లాన్ ఆఫర్లు

ఈ జాబితాలో తదుపరి ప్లానుగా, ఈ అన్లిమిటెడ్ చిన్న ప్యాక్ రూ .21 గురించి చెప్పొచ్చు. ఇది అపరిమిత వాయిస్ కాల్స్, 150 ఎంబి డేటా మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ తో రెండు రోజుల చెల్లుబాటుతో వస్తుంది. మీరు రీఛార్జ్ చేసినప్పుడు, ఈ ప్రయోజనాలు 00:00 గంటల వరకు చెల్లుతాయి. ఉదాహరణకు, మీరు ఈ రోజు రాత్రి 10 గంటలకు రూ .21 ప్యాక్ రీఛార్జ్ చేస్తే, ప్రయోజనం మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే చెల్లుతుంది, అంటే రెండు గంటలు మాత్రమే. కాబట్టి రీఛార్జ్ చేయాలనుకున్నప్పుడు, ముందుగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ప్యాక్‌ ను పూర్తిగా ఉపయోగించుకోవడానికి, ఉదయాన్నే లేదా 12 గంటల తర్వాత రీఛార్జ్ చేయండి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :