Vodafone Idea
Vodafone Idea ఎట్టకేలకు Vi 5G టైం లైన్ కన్ఫర్మ్ చేసింది. ఇండియాలో మూడవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన వోడాఫోన్ ఐడియా 5జి నెట్ వర్క్ కోసం ఎదురు చూస్తున్న యూజర్ల కోసం 5జి టైం లైన్ ను అనౌన్స్ చేసింది. వాస్తవానికి, దేశంలో 4 టెలికాం కంపెనీలు కొనసాగుతున్నా, ఇప్పటి వరకు Jio మరియు Airtel మాత్రమే 5G నెట్ వర్క్ కలిగిన కంపెనీలుగా కొనసాగుతున్నాయి. అయితే, ఇప్పుడు ఎట్టకేలకు ఈ రెండు టెలికాం కంపెనీలకు మరో పోటీదారుగా వోడాఫోన్ ఐడియా వస్తోంది.
ఇటీవల వోడాఫోన్ ఐడియా (Vi) చేసిన అనౌన్స్మెంట్ ప్రకారం, మార్చి 2025 లో ముందుగా ముంబై నగరంలో 5G సేవలు ప్రారంభిస్తుంది. అంటే, వచ్చే నెలలో వోడాఫోన్ ఐడియా (Vi) తన 5జి సర్వీసులను ప్రారంభిస్తుంది. అంతేకాదు, ముంబై నగరంలో పూర్తి స్థాయిలో సర్వీస్ లను అందించిన వెంటనే దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, పాట్నా మరియు చండీగఢ్ వంటి మరిన్ని నగరాల్లో ముందుగా 5జి సేవలు విస్తరిస్తుందని చెబుతోంది.
5G నెట్ వర్క్ కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (DoT) నిర్ణయించిన మినిమమ్ రోల్అవుట్ ఆబ్లిగేషన్స్ (MRO) ను చేరుకోవడానికి వీలుగా 3.5GHz (సి-బ్యాండ్) మరియు 26GHz (mm వేవ్ బ్యాండ్) ను చాలా ప్రాంతాల్లో మోహరించినట్లు కూడా వోడాఫోన్ ఐడియా పేర్కొంది.
Also Read: గ్రౌండ్ షేక్ చేసే LG 800W 5.1 Soundbar పై ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ ఆఫర్ అందుకోండి.!
అయితే, వోడాఫోన్ ఐడియా యూజర్ల కోసం ఎటువంటి ప్లాన్స్ అందిస్తుందో క్లారిటీ రావాల్సి వుంది. ఎందుకంటే, 5జి తీసుకురావడంతో పాటు ARPU (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) ను కూడా దృష్టిలో ఉంచుకుని 5జి ప్లాన్ లను తీసుకురావాల్సి ఉంటుంది. టెలికాం కంపెనీలకు అన్నిటికంటే పెద్ద చాలెంజింగ్ గా ఉండే విషయం ఇదే అవుతుంది.
ఇక 5జి నెట్ వర్క్ ముందుగా అందుబాటులోకి రానున్న ప్రాంతాల లిస్ట్ తో కూడిన మ్యాప్ ను కూడా వోడాఫోన్ ఐడియా విడుద చేసింది. ఈ మ్యాప్ మరియు లిస్ట్ ప్రకారం 17 రాష్ట్రాల లోని చాలా ప్రధాన ప్రాంతాల్లో వి 5జి సేవలు అందుబాటులోకి రానున్నట్లు అర్థం అవుతోంది. ఇందులో ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్, కర్ణాటక, బీహార్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ, హర్యానా మరియు కలకత్తా ఉన్నాయి.
Vi బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి Click Here