రూ.151 రీఛార్జ్ తో Disney+ Hotstar చందా మరియు 8GB హై స్పీడ్ డేటా పొందండి.!

Updated on 05-Feb-2023
HIGHLIGHTS

రూ.151 రీఛార్జ్ తో Disney+ Hotstar సభ్యత్వం మరియు 8GB హై స్పీడ్ డేటా

వోడాఫోన్ ఐడియా తన కస్టమర్ల కోసం గొప్ప ప్లాన్ అందించింది

తక్కువ ధరలో OTT ప్రయిజాలను అందించే బెస్ట్ ప్లాన్

రూ.151 రీఛార్జ్ తో Disney+ Hotstar సభ్యత్వం మరియు 8GB హై స్పీడ్ డేటా పొందండి. అన్ని టెలికం కంపెనీలు కూడా OTT చందా  స్క్రిప్షన్ లాభాలను అందించే ప్లాన్ లను ఎక్కవగా అఫర్ చేస్తున్నాయి. ఇదే దారిలో వోడాఫోన్ ఐడియా కూడా తన కస్టమర్ల కోసం గొప్ప ప్లాన్ అందించింది. ఈ ప్లాన్ తో చాలా చవక ధరకే డిస్ని+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ మరియు డేటా కూడా వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు అందిస్తుంది. ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలను ఈరోజు చూద్దాం.   

Vi Rs.151 Plan

వోడాఫోన్ ఐడియా యొక్క లేటెస్ట్ రూ.151 ప్లాన్ యూజర్లకు తక్కువ ధరలో OTT ప్రయిజాలను అందించే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే కస్టమర్లకు 3 నెలల Disney+ Hot Star సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే, ఈ ప్లాన్ తో 8GB హై స్పీడ్ డేటా కూడా మీకు అందుతుంది. అయితే, ఈ ప్లాన్ తో కాలింగ్ లేదా SMS వంటి ప్రయోజనాలు మీకు లభించవు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కానీ, సర్వీస్ వ్యాలిడిటీని మాత్రం అందించదు. 

అంటే, ఈ ప్లాన్ తో మీకు 3 నెలల Disney+ Hot Star సబ్ స్క్రిప్షన్ మరియు 8GB డేటా ప్రయోజనం మాత్రమే అందుతాయి. OTT సబ్ స్క్రిప్షన్ తో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మరియు మరిన్ని ప్రయోజనాలను అందించే వోడాఫోన్ ఐడియా (Vi) బెస్ట్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే vi యొక్క రూ.399 ప్లాన్ ను పరిశీలించవచ్చు.          

Vi Rs.399 Plan

వోడాఫోన్ ఐడియా యొక్క బెస్ట్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2.5GB డేటా మరియు డైలీ 100 SMS లను కూడా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ తో మీకు 3 నెలల Disney+ Hotstar సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. 

అంతేకాదు, ఈ ప్లాన్ తో Vi మూవీస్&టీవీ ఉచిత యాక్సెస్ తో పాటుగా రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 వరకూ స్ట్రీమింగ్, సర్ఫింగ్ మరియు షేరింగ్ వంటి వాటిని ఎటువంటి డేటా ఖర్చు లేకుండా ఆనందించవచ్చు. Vi యాప్ నుండి రీఛార్జ్ చేసే వారికి 5GB అదనపు డేటా కూడా లభిస్తుంది. అలాగే, వారాంతంలో మిగులు డేటాను మీ  పొందవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :