వోడాఫోన్ 139 ప్లానుతో డైలీ 2GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్

వోడాఫోన్ ప్రస్తుతం మార్కెట్లో కొనసాగుతున్న డేటా వార్ కి సరిపడా ఒక సరికొత్త రూ.139 ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లానుతో, డేటా, కాలింగ్ మరియు SMS వంటి అన్ని లాభాలను వోడాఫోన్ వినియోగదారులు అందుకుంటారు. అంతేకాదు, ఇది రోజుకు ఏకంగా 2GB 2G/3G/4G డేటాని ప్రకటించి, అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. వాస్తవానికి, జియో కూడా ఈ ధరలో ఇంత డేటాని అందించడం లేకపోవడం చప్పుకోదగ్గ విషయం. 

వోడాఫోన్ Rs 139 ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రయోజనాలు

పైన పేర్కొన్న విధంగా, వోడాఫోన్ యొక్క ఈ సరికొత్త Rs 139 ప్రీపెయిడ్ ప్లానుతో లోకల్, STD మరియు రొమింగుతో కూడా అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే, రోజువారీ 2GB హై స్పీడ్ డేటాని పూర్తి చెల్లుబాటు కాలానికి గాను అందుకోవచ్చు. అధనంగా, రోజువారీ 100SMS లతో కూడా ఈ ప్లాన్ అలరిస్తుంది. ఇక దీని వ్యాలిడిటీ విషయానికి వస్తే, ఇది 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. 

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతానికి, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ NCR, గుజరాత్, హర్యానా, జమ్మూ కాశ్మిర్, రాజస్థాన్, తూర్పు UP వంటి సర్కిళ్లలో ప్రస్తుతం  అందుబాటులోవున్న వోడాఫోన్ యొక్క సొంత ప్రీపెయిడ్ ప్లాన్స్ అయినటువంటి, రూ.129 మరియు రూ.159 వంటి వాటికీ మధ్యలో పోటీగా వచ్చి చేరుతుంది. కానీ, దీనితో రోజువారీ 2GB డేటా అందుతుంది కాబట్టి, వినియోగదారులు ఎక్కువగా దీని వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.     

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :