users complaining about jio down on downdetector and social media
Jio Down: కొన్ని ప్రాంతాల్లో జియో నెట్ వర్క్, జియో ఇంటర్నెట్ మరియు జియో ఫైబర్ పని చేయడం లేదని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెట్ వర్క్ సిస్టం లో కలిగే అంతరాయం గురించి రియల్ టైం లో వివరాలు అందించే downdetector సాక్షిగా యూజర్లు జియో సేవల్లో అంతరాయం కలిగినట్లు రిపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి ఈ సమస్య చూస్తున్నట్లు కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇదే సమస్య చవి చూస్తున్నట్లు రిపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు, ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X పై కూడా యూజర్లు ఎక్కువగా రిపోర్ట్ చేస్తున్నారు.
రిలయన్స్ జియో మొబైల్ నెట్ వర్క్, మొబైల్ ఇంటర్నెట్ మరియు జియో ఫైబర్ సర్వీసులకు అంతరాయం కలిగినట్లు యూజర్లు downdetector లో కంప్లైంట్ చేస్తున్నారు. ఇది ఒక అంతరాయం నివేదిక ప్లాట్ ఫామ్ మరియు ఇందులో సర్వర్ మరియు నెట్వర్క్ ఇష్యులను రిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది.
ఈ ఔటేజ్ ప్లాట్ ఫామ్ పై ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి మొదలుకొని ఇప్పటివరకు అనేక ప్రాంతాల నుంచి రిపోర్ట్స్ నమోదు అయ్యాయి. ఇందులో ఎక్కువగా ఢిల్లీ నుంచి నమోదు అయినట్లు సైట్ మ్యాప్ చూపిస్తోంది. మొత్తం నమోదైన కంప్లయింట్స్ లో 54% జియో ఫైబర్ పై నమోదు అవ్వగా, 36% జియో మొబైల్ ఇంటర్నెట్ పై నమోదు అయ్యాయి. అలాగే, 10% కంప్లయింట్స్ మాత్రం జియో నెట్ వర్క్ లో అంతరాయం కలిగినట్లు నమోదు అయ్యాయి.
Also Read: భారీ డిస్కౌంట్ తో 9 వేలకే లభిస్తున్న లేటెస్ట్ 750W Dolby 5.1 సౌండ్ బార్
ఈ ఔటేజ్ సమస్య చవి చూసిన యూజర్లు X ప్లాట్ ఫామ్ పై వారు ఎదుర్కొన్న ఇబ్బంది గురించి కామెంట్ పోస్ట్ చేశారు. వాటిలో కొన్ని పోస్టులు ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రధాన నగరాల్లో నెట్ వర్క్ మరియు జియో ఫైబర్ రెండు సర్వీసుల్లో ఈ సమస్య చూసినట్లు చెబుతున్నారు.