28 రోజులు కాదు ఇక 30 రోజులు: ట్రాయ్ కొత్త నిర్ణయం అదిరిందిగా.!

HIGHLIGHTS

TRAI (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) కొత్త నిర్ణయం

టెలికం యూజర్లకు నిజంగా పండగ లాంటి వార్తను తీసుకొచ్చింది

రాబోయే కాలంలో అన్ని ప్లాన్‌లు కూడా 30 రోజుల చెల్లుబాటుతో వస్తాయి

TRAI (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిర్ణయం టెలికం యూజర్లకు నిజంగా పండగ లాంటి వార్తను తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ నెల రోజుల రీఛార్జ్ అంటే కేవలం 28 రోజులే అని  టెలికం కంపెనీలు ఉదరగొడుతున్నాయి కదా, ఇప్పుడు ఆ పోప్పులు ఉడకవని TRAI తేల్చిచెప్పింది. ఎయిర్టెల్, జియో మరియు Vi మూడు ప్రధాన టెలికం కంపెనీలు కూడా పూర్తి నెల రోజుల రీఛార్జ్ ప్లాన్ అంటే కేవలం 28 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తున్నాయి. కానీ, ఇక ఈ 28 రోజుల ప్లాన్స్ పనిచేయవని కేంద్ర ఏజెన్సీ ప్రకటించింది. అంతేకాదు, అన్ని టెలికం కంపెనీలు కూడా పూర్తి నెల రోజుల సైకిల్ తో వచ్చే ప్లాన్‌ను అందించాలని తెలిపింది.

TRAI చర్యల ఫలితంగా, ప్రస్తుత 28 రోజుల వ్యవధితో నడుస్తున్న ప్లాన్స్ కథ కంచికి చేరుతుంది. అంటే, రాబోయే కాలంలో అన్ని ప్లాన్‌లు కూడా 30 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. ఈ మేరకు ట్రాయ్‌ విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను పేర్కొంది.

ట్రాయ్ కొత్త విధానాల ప్రకారం, అన్ని టెలికం సంస్థలు కూడా ఈ నిభంధనలను పాటించ వలసి వస్తుంది. అంటే, కనీస వోచర్ మొదలుకొని ప్రత్యేక టారిఫ్ వోచర్ల వరకూ కూడా అన్ని ప్లాన్స్ కూడా 30 రోజుల పాటు చెల్లుబాటులో ఉండాలి. అంటే, ఇక నుండి రీఛార్జ్ చేసే ప్లాన్ మళ్ళి తిరిగి అదే రోజున రీఛార్జ్ చేసుకునే విధంగా ఉండేలా టెలికం కంపెనీలు చూసుకోవాలి. టెలికం కంపెనీలు ఈ విధంగా తమ ప్లాన్స్ ను సరిచేసుకోవడానికి కేంద్ర ఏజెన్సీ TRAI వారికి 60 రోజుల సమయం ఇచ్చింది.

మొబైల్ నంబర్ యూజర్ల నుండి వచ్చిన వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరూ టెలికాం టారిఫ్ ఆర్డర్‌ను పాటించాలని 2022 జనవరి ప్రారంభంలోనే TRAI ప్రకటించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :