Jio ధమాకా: 388 రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ అఫర్.!!

Updated on 05-Apr-2023
HIGHLIGHTS

388 రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ అఫర్

ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే జియో కస్టమర్లు 388 రోజులు నిశ్చితంగా ఉండవచ్చు

అధిక డేటా అవసరాన్ని కూడా తీర్చగలిగే బెస్ట్ ప్లాన్

Jio ధమాకా: 388 రోజులు అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ అఫర్ ఒకటి వుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే జియో కస్టమర్లు 388 రోజులు నిశ్చితంగా ఉండవచ్చు. ఈ ప్లాన్ తో ప్రతీరోజూ 2.5GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ తో సహా మరిన్ని లాభాలను పొందే వీలుంది. ప్రతిరోజూ కాలింగ్ మరియు అధిక డేటా అవసరాన్ని కూడా తీర్చగలిగే ఈ బెస్ట్ ప్లాన్ గురించి తెలుసుకుందామా.    

మనం ఇప్పుడు మాట్లాడుతోంది Jio యొక్క Rs.2,999 Plan గురించి. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటులో వస్తుంది మరియు 23 రోజుల అదనపు వ్యాలిడిటీని ఉచితంగా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ అఫర్ చేసే అన్ని లాభాలను క్రింద చూడవచ్చు.

Jio Rs.2,999 Plan

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో మరియు 23 రోజుల అదనపు వ్యాలిడిటీతో కలిపి మొత్తం 388 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. ఈ మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా మరియు 75GB అదనపు డేటా కలుపుకొని మొత్తం 987.5GB ల హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. 

అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత  యాక్సెస్ ను తీసుకువస్తుంది. అంతేకాదు, జియో 5G నెట్ వర్క్ అందుబాటులో ఉన్న సమయంలో అన్లిమిటెడ్ 5G డేటాని ప్రయోజనాన్ని కూడా ఈ ప్లాన్ తో పొందవచ్చు.    

తక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీ అందించే మరొక ప్లాన్ కూడా. అదే Jio యొక్క Rs.2,023 Plan మరియు ఈ ప్లాన్ కూడా ప్రతిరోజూ కాలింగ్ మరియు అధిక డేటా అవసరాన్ని తీర్చగలిగే బెస్ట్ ప్లాన్ గా చెప్పవచ్చు.     

Jio Rs.2,023 Plan

ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 252 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 630 GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. 

మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :