రేపటితో ముగియనున్న జియో హ్యాపీ న్యూ ఇయర్ అఫర్

HIGHLIGHTS

కస్టమర్ల కోసం అధిక వ్యాలిడిటీ అఫర్ చేసే Jio బంపర్ అఫర్

ఈ అఫర్ 2022 జనవరి 2న, అంటే రేపటితో ముగుస్తుంది

జియో హ్యాపీ న్యూ ఇయర్ అఫర్ ప్లాన్

రిలయన్స్ జియో 2022 న్యూ ఇయర్ సందర్భంగా కస్టమర్ల కోసం అధిక వ్యాలిడిటీ అఫర్ చేసే  బంపర్ అఫర్ ప్రకటించింది. అదే, రూ.2545 రూపాయల ధరలో వచ్చే జియో హ్యాపీ న్యూ ఇయర్ అఫర్. ఈ అఫర్ ప్లాన్ ద్వారా జియో కస్టమర్లకు 29 రోజుల అధిక వ్యాలిడిటీని ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లో జతచేసింది. ఈ అఫర్ 2022 జనవరి 2న, అంటే రేపటితో ముగుస్తుంది.

ఇక ఈ జియో హ్యాపీ న్యూ ఇయర్ అఫర్ ప్లాన్ రూ.2,545 రూపాయలకు వస్తుంది. ఈ అఫర్ లో భాగంగా ఈ ప్లాన్ పూర్తి 365 రోజుల వ్యాలిడిటీని తీసుకువస్తుంది. వాస్తవానికి, ఈ ప్లాన్ ముందుగా 336 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అఫర్ చేసేది. అయితే, జియో ప్రకటించిన  న్యూ ఇయర్ అఫర్ ద్వారా 29 రోజుల అదనపు వ్యాలిడిటీని కలుపుకొని ఇది మొత్తం పూర్తి సంవత్సరం వస్తుంది.

ఇక ఈ వ్యాలిడిటీ కాలానికి (336 రోజులు) గాను డైలీ 1.5 GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ ను కూడా ఆఫర్ అఫర్ చేస్తుంది. అంతేకాదు, డైలీ 100 SMS లిమిట్ తో పూర్తి 336 రోజులకు అందిస్తుంది మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ ను కూడా తీసుకువస్తుంది.

మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం ఇక్కడ Click చెయ్యండి  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :