జియో ఆఫర్: వెయ్యి రూపాయల లోపలే 336 రోజుల ప్రయోజనాలు అందుకోండి.!

HIGHLIGHTS

అతితక్కువ ధరలో కూడా ఎక్కవ రోజుల వాలిడిటీతో బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్

అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా ప్రయోజనాలను 336 రోజుల పాటు పొందుతారు

జియో ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్లాన్ గురించి తెలుసుకోండి

అతితక్కువ ధరలో కూడా ఎక్కవ రోజుల వాలిడిటీతో బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ ను కూడా జియో వినియోగదారులకు అందించింది. అదే రూ.895 రూపాయల బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో పాటుగా కాలింగ్, డేటా మరియు మరిన్ని లాభాలను వినియోగదారులకు అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ కేవలం జియోఫోన్ యూజర్ల కోసం మాత్రమే అందించింది. 

ఈ ప్లాన్ తో తో జియోఫోన్ కస్టమర్లు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా తో మరియు ఇంకా చాలా ప్రయోజనాలను 336 రోజుల పాటు పొందుతారు. జియోఫోన్ వినియోగదారుల కోసం జియో ఆఫర్  చేస్తున్న ఈ బెస్ట్ ప్లాన్  గురించి తెలుసుకోండి.  

జియో రూ.895 ప్లాన్

జియో యూజర్ల కోసం అందించిన ఈ రూ.899 ప్లాన్ 336 రోజుల లాంగ్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇది పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇది ఒక నెల సమయాన్ని 28 రోజులకు కుదిస్తుంది, జియో రెగ్యులర్ ఒక నెల రీఛార్జ్ మాదిరిగా ఉంటుంది. అలాగే ఈ ప్లాన్ తో అందించే ప్రయోజనాలు కూడా అలాగే ఉంటాయి. ఈ ప్లాన్ తో 28 రోజుల కు 2GB డేటా చొప్పున 12 నెలలకు 24 GB(2GB x 12నెలలు)  హై స్పీడ్ డేటా అందిస్తుంది. అలాగే, నెలకు 50 SMS చొప్పున 12 నెలలకు (28 డేస్ x 12 సైకిల్స్)  ఉచిత SMS సౌకర్యాన్ని మరియు అన్ని జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ ని కూడా ఇస్తుంది.

ఇక జియో కస్టమర్లకు అధిక లాభాలను అందించే బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ గురించి చూస్తే Jio Rs.2,999 Plan ను పరిశీలించవచ్చు. ఈ ప్లాన్ అందించే అన్ని ప్రయోజాలను ఈ క్రింద చూడవచ్చు.

Jio Rs.2,999 Plan

జియో రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ ముందు నుండే 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుండగా, న్యూ ఇయర్ అఫర్ లో భాగంగా 23 రోజుల ఎక్ట్రా వ్యాలిడిటీని కూడా జత చేసింది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 912.5 GB డేటాని మరియు 75 అధనపు డేటాని కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

మరిన్ని బెస్ట్ జియో ప్లాన్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :