జియో అఫర్: ప్రముఖ OTT ప్లాట్ ఫామ్స్ ఉచిత సబ్ స్క్రిప్షన్ తెచ్చే బెస్ట్ ప్లాన్..!!

HIGHLIGHTS

రిలయన్స్ జియో యొక్క పోస్ట్ పైడ్ ప్లాన్

OTT ప్లాట్‌ఫామ్స్ యొక్క సబ్ స్క్రిప్షన్స్ ను ఉచితంగా అఫర్ చేస్తోంది

ఈ ప్లాన్స్ రూ.399 నుండి ప్రారంభమవుతాయి

రిలయన్స్ జియో యొక్క పోస్ట్ పైడ్ ప్లాన్ తో Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని+ హాట్ స్టార్ మూడు OTT ప్లాట్‌ఫామ్స్ యొక్క సబ్ స్క్రిప్షన్స్ ను ఉచితంగా అఫర్ చేస్తోంది. వాస్తవానికి, ఏ OTT ప్లాట్ ఫామ్ యొక్క సబ్ స్క్రిప్షన్ కోసమైనా ప్రతినెలా డబ్బును చెల్లించవలసి వస్తుంది. కానీ, జియో యొక్క ఈ పోస్ట్ ప్లాన్ ఎంచుకునేవారు మూడు ప్రధాన ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అయిన Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని+ హాట్ స్టార్ మూడు OTT ప్లాట్‌ఫారమ్స్ యొక్క ఉచిత సబ్ స్క్రిప్షన్ ను పొందవచ్చు.

ఈ అఫర్ ప్రీపెయిడ్ కస్టమర్లకు వర్తించదు. ఎందుకంటే, ఈ ప్లాన్ లను కేవలం పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం మాత్రమే అందించింది. ఈ ప్లాన్స్ రూ.399 నుండి ప్రారంభమవుతాయి మరియు ఇది వీటిలో బెస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఈ ప్లాన్ అధిక డేటా అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాబాలాను అందిస్తుంది.

Jio రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

జియో యొక్క ఈ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఒక నెల రెంటల్ ప్లాన్ మరియు ఇది బిల్ వ్యవధికి గాను 75 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS లిమిట్ కూడా వుంది. ఈ ప్లాన్ తో Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని+ హాట్ స్టార్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా పొందుతారు. అంతేకాదు, మీరు 200 GB వరకు డేటాని రోల్ అవుట్ కూడా చేసుకోవచ్చు.

ఇదే లాభాలను అఫర్ చేసే మరొక రెండు ప్లాన్స్ ని కూడా అందించింది. ఇవి మీ ఫ్యామిలీ ప్లాన్స్ మరియు ఈ ప్లాన్స్ మీకు అధనపు SIM కార్డ్ ను కూడా తీసుకువస్తాయి. అందులో ఒకటి రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మరియు మరొకటి రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్. వీటిలో రూ.599 ప్లాన్ 1 సిమ్ కార్డ్ తో వస్తుంది. రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మాత్రం 2 అదనపు సిమ్ కార్డ్ లను తీసుకువస్తుంది.

మరిన్ని జియో బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :