Jio Festive Offer: పండుగ సందర్భంగా కొత్త 36 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ ప్రకటించిన జియో.!

Updated on 12-Jan-2026
HIGHLIGHTS

సంక్రాంతి 2026 పండుగ సందర్భంగా Jio Festive Offer అందించింది

రిలయన్స్ జియో యూజర్ల కోసం ఈ పండుగ ఆఫర్ ని ప్రకటించింది

తక్కువ ధరలో ఎక్కువ లాభాలు అందిస్తుందని రిలయన్స్ జియో తెలిపింది

Jio Festive Offer: సంక్రాంతి 2026 పండుగ సందర్భంగా దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో, తన యూజర్ల కోసం పండుగ ఆఫర్ ని ప్రకటించింది. పండుగ సందర్భంగా కొత్త 36 రోజుల అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ ను రిలయన్స్ జియో తన యూజర్ల కోసం అందించింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తక్కువ ధరలో ఎక్కువ లాభాలు అందిస్తుందని రిలయన్స్ జియో తెలిపింది. జియో కొత్తగా తీసుకువచ్చిన ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ కు అయ్యే ఖర్చు మరియు ఈ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు వివరంగా తెలుసుకుందాం.

Jio Festive Offer : ఆఫర్ ప్లాన్ ఏమిటి?

సంక్రాంతి 2026 పండుగ సందర్భంగా రిలయన్స్ జియో కొత్త రూ. 450 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను తన పోర్ట్ఫోలియో కి జత చేసింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ 36 రోజులు పాటు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుంది మరియు అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తుంది.

Jio Festive Offer : ఈ ప్లాన్ అందించే పూర్తి బెనిఫిట్స్?

జియో యొక్క ఈ కొత్త రూ. 450 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 36 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ 36 రోజుల వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా మరియు 4జి నెట్ వర్క్ పై డైలీ 2 జీబీ డేటా చొప్పున టోటల్ 72 జీబీల డేటా అందిస్తుంది మరియు 60Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది.

ఈ ప్లాన్ తో మరిన్ని ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిలో మొదటిది మూడు నెల ఉచిత జియో హాట్ స్టార్ యాక్సెస్. ఈ ఉచిత బెనిఫిట్ ఈ ప్లాన్ తో అందిస్తుంది. ఒక రెండోది గూగుల్ జెమినీ ఎఐ ప్రో యాక్సెస్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రూ. 35,100 రూపాయల విలువైన గూగుల్ జెమినీ ఎఐ ప్రో 18 నెలల యాక్సెస్ ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ తో JioHome 2 నెల రోజుల ఉచిత ట్రయిల్ ఆఫర్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 50 జీబీ JioAICloud ఉచిత స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా ఈ ప్రీపెయిడ్ ప్లాన్ జియో టీవీ కోసం ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.

Also Read: బెస్ట్ Dolby Audio సౌండ్ బార్ డీల్స్ అండర్ రూ. 5,000: ఈరోజు బెస్ట్ డీల్స్.!

ఈ కొత్త రూ. 450 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ను మై జియో లేదా ఏదైనా UPI యాప్ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :