రూ.225 ధరకే జీవితాంతం వ్యాలిడిటీ అందించే ఈ ప్లాన్ గురించి మీకు తెలుసా.!

HIGHLIGHTS

రూ.225 ధరకే జీవితాంతం వ్యాలిడిటీ అందించే ఈ ప్లాన్ గురించి మీకు తెలుసా

రూ.225 రూపాయలకే లైఫ్ టైం వ్యాలిడిటీ

ఈ ప్లాన్ ను ప్రభుత్వ టెలికం సంస్థ అఫర్ చేస్తోంది

రూ.225 ధరకే జీవితాంతం వ్యాలిడిటీ అందించే ఈ ప్లాన్ గురించి మీకు తెలుసా? ఒట్టి మాట అనుకోకండి, నిజంగానే రూ.225 రూపాయలకే లైఫ్ టైం వ్యాలిడిటీ అందించే బెస్ట్ ప్లాన్ ఒకటి వుంది. ఈ ప్లాన్ ను ప్రభుత్వ టెలికం సంస్థ అఫర్ చేస్తోంది. మహానగర్ టెలికం నిగమ్ లిమిటెడ్ (MTNL) అందిస్తున్న రూ.225 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటోంది. మహానగర్ టెలికం నిగమ్ లిమిటెడ్ (MTNL) మాత్రం ఈ రూ.225 (JS) ప్రీపెయిడ్ ప్లాన్ తో Life Time వ్యాలిడిటీని అందిస్తోంది. ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న పూర్తి ప్రయోజనాలను తెలుసుకోండి.

MTNL Rs.225 (JS) Plan:

ఈ ప్లాన్ కోసం మీరు కేవలం రూ.225 రూపాయలు చెల్లించి ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. మీకు ఈ ప్లాన్ రీఛార్జ్ తో లైఫ్ టైం వ్యాలిడిటీ అందుతుంది. కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాదు రీఛార్జ్ తో మీకు 100 నిముషాల ఉచిత కాలింగ్ మినిట్స్ కూడా అందుతాయి. అంటే, కేవలం 225 రూపాయల ఖర్చుతోనే జీవితకాలం వ్యాలిడిటీతో పాటుగా 100 నిముషాల కాలింగ్ మినిట్స్ కూడా మీరు పొందుతారు.

ఒక కాలింగ్ రేట్ మరియు ఇతర వివరాల్లోకి వెళితే, హోమ్ నెట్వర్క్ పైన లోకల్ మరియు STD కాలింగ్ కోసం నిముషానికి రూ.0.20 (20పైసలు) ఛార్జ్ చేయబడుతుంది. ఇక వీడియో కాలింగ్ కోసం నిముషానికి రూ.0.60 మరియు ఇతర నెటవర్క్ కోసం రూ.0.60 ఛార్జ్ చేయబడుతుంది. ఇక SMS ఛార్జ్ విషయానికి వస్తే, లోకల్ SMS కోసం Rs.0.50/SMS, నేషనల్ SMS కోసం Rs.0.50/SMS మరియు ఇంటర్నేషనల్ SMS కోసం రూ.4 నుండి రూ.5 వరకు చెల్లించాలి. చివరిగా డేటా విషయానికి వస్తే, 1MB డేటా వినియోగానికి 3పైసలు చెల్లించాలి.

గమనిక: MTNL నెట్ వర్క్ కేవలం ఢిల్లీ మరియు ముంబై నగరాలకు మాత్రమే వర్తిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :