జియో WiFi కాలింగ్ తో ఉత్తమమైన వాయిస్ మరియు వీడియో కాల్స్ దీని సొంతం : మరి మీ ఫోను సపోర్ట్ చేస్తుందా?

HIGHLIGHTS

ప్రతి జియో వినియోగదారుని వాయిస్ కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది

రిలయన్స్ జియో ఇప్పటికే  వై-ఫై సర్వీస్ లో వాయిస్ మరియు వీడియో కాలింగ్ చేసేవిధానాన్ని దేశవ్యాప్తంగా ప్రకటించింది. సంస్థ ప్రకారం, ఈ ఫీచర్ గత కొన్ని నెలలుగా పరీక్షా దశలో ఉంది. ఈ కొత్త Jio Wi-Fi కాలింగ్ ఫీచర్ ఏదైనా Wi-Fi బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ద్వారా ఉపయోగించవచ్చు. ఇక్కడ వాయిస్ మరియు వీడియో కాల్స్ ప్రాథమికంగా VoLTE మరియు Wi-Fi మధ్య మారతాయి.

ఈ సేవను ప్రారంభించడం గురించి జియో డైరెక్టర్ మిస్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ, “జియో యొక్క కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి లేదా వారి సమస్యలను పరిష్కరించడానికి మేము నిరంతరం కొత్త ఆవిష్కరనలను తీసుకొస్తాము. ఈ సమయంలో, సగటు జియో వినియోగదారుడు ప్రతి నెలా 900 నిమిషాల కంటే ఎక్కువ వాయిస్ కాల్స్ ను ఉపయోగిస్తున్నారు  మరియు పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యతో, జియో వై-ఫై కాలింగ్ పరిచయం ప్రతి జియో వినియోగదారుని వాయిస్ కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ”

దేశీయ కాల్స్ కోసం ఈ సేవ ఉచితంగా ఇవ్వబడుతుంది మరియు పైన చెప్పినట్లుగా, కాల్స్ ప్రాథమికంగా మారతాయి. తద్వారా, వినియోగదారులకు అదనపు కాలింగ్ ఆప్ లేదా సిమ్ కార్డ్ అవసరం లేదు. రిలయన్స్ జియో, చాలా స్మార్ట్‌ ఫోన్లలో వై-ఫై కాలింగ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ధృవీకరించింది. ఈ జాబితాలో 150 కి పైగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. జియో యొక్క కొత్త వై-ఫై కాలింగ్ ఫీచర్ కేవలం వాయిస్‌ కు మాత్రమే పరిమితం కాదు, ఎందుకంటే కంపెనీ వినియోగదారులకు వై-ఫై ద్వారా వీడియో కాల్స్ చేయడానికి కూడా వీలుంటుంది.

150 కి పైగా స్మార్ట్ ఫోన్లు ఈ ఫీచరును కలిగి వున్నాయి. ఈ ( LINK )ద్వారా మీ ఫోన్ గురించి తెలుసుకోండి.    

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :