Free Netflix మరియు Unlimited 5G డేటా అందించే జియో బెస్ట్ ప్లాన్స్.!

HIGHLIGHTS

బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను చాలానే అందించింది రిలయన్స్ జియో

ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ గొప్పగా ఆకట్టుకుంటున్నాయి

. Free Netflix మరియు Unlimited 5G డేటా అందించే జియో బెస్ట్ ప్లాన్స్

యూజర్లకు గొప్ప ప్రయోజనాలను అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను చాలానే అందించింది రిలయన్స్ జియో. వాటిలో ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ గొప్పగా ఆకట్టుకుంటున్నాయి. ఎందుకంటే, కాలింగ్, డేటా మరియు SMS ప్రయోజనాలతో పాటుగా ప్రముఖ OTT సబ్ స్క్రిప్షన్ లను కూడా ఉచితంగా ఈ ప్లాన్స్ అందిస్తాయి. Free Netflix మరియు Unlimited 5G డేటా అందించే జియో బెస్ట్ ప్లాన్స్ గురించి ఈరోజు చూడనున్నాము.

Jio Plans with Free Netflix Unlimited 5G Data

జియో యొక్క ఈ రెండు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

రిలయన్స్ జియో యూజర్స్ కి ఉచిత నెట్ ఫ్లిక్స్ సబ్స్ స్క్రిప్షన్ మరియు అన్లిమిటెడ్ 5జి డేటా ఆఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్ 2 ఉన్నాయి. అవి జియో రూ. 1,099 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్ లు ఉన్నాయి. ఈ రెండు కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. మరి జియో యొక్క ఈ రెండు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే ప్రతి ప్రయోజనాలను వివరంగా చూద్దాం.

జియో రూ. 1,099 ప్రీపెయిడ్ ప్లాన్

జియో యొక్క ఈ రూ. 1,099 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటాని అందిస్తుంది. అయితే, 4G నెట్ వర్క్ పైన రోజుకు 2GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 100 SMS మరియు JioTV, Jio Cinema, Jio Cloud లకు ఉచిత యాక్సెస్ అందిస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ తో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ యొక్క ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

జియో రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్

జియో యొక్క ఈ రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు 5జి నెట్ వర్క్ పైన 5జి అన్లిమిటెడ్ డేటాని అందిస్తుంది. అయితే, 4G నెట్ వర్క్ పైన మాత్రం రోజుకు 3GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ తో మీకు డైలీ 100 SMS ప్రయోజనం మరియు JioTV, Jio Cinema, Jio Cloud లకు ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ను కూడా ఉచిత లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :