Jio Top Plan: రోజుకి రూ. 5 ఖర్చుతోనే నెలంతా 12 OTT లు ఆనందించండి.!

HIGHLIGHTS

అధిక లాభాలను అందించే Jio ఆల్రౌండ్ ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్

తి తక్కువ ధరలో 12 OTT ల సబ్ స్క్రిప్షన్ ను తీసుకు వచ్చే బెస్ట్ ప్లాన్

వలం రూ. 5 రూపాయల 20 పైసల ఖర్చుతోనే 12 ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లాభాలను అందిస్తుంది

Jio Top Plan: రిలయన్స్ జియో యూజర్ల కోసం అధిక లాభాలను అందించే ఆల్రౌండ్ ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను అందించింది. ఈ ప్లాన్ లు కాలింగ్, డేటా మరియు ప్రముఖ OTT సబ్ స్క్రిప్షన్ లను కూడా అందిస్తాయి. అయితే, వీటిలో అతి తక్కువ ధరలో 12 OTT ల సబ్ స్క్రిప్షన్ ను తీసుకు వచ్చే బెస్ట్ ప్లాన్ ఒకటి వుంది . ఈ బెస్ట్ బడ్జెట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ రోజుకు కేవలం రూ. 5 రూపాయల 20 పైసల ఖర్చుతోనే డేటా మరియు 12 ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లాభాలను కూడా అందిస్తుంది.

Jio Top Plan

రిలయన్స్ జియో 2023 ఎండ్ లో తీసుకు వచ్చిన రూ. 148 రూపాయల ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అమౌంట్ ను రోజు వారీగా లెక్కిస్తే రోజుకు కేవలం 5 రూపాయల 20 పైసలు మాత్రమే అవుతుంది. అయితే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 10 GB డేటా 28 రోజుల చెల్లుబాటుతో అంధిస్తుంది. అంతేకాదు, పేరు పొందిన 12 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ యొక్క సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

Also Read: Infinix Smart 8 Plus: 7 వేలకే ఐఫోన్ లాంటి ఫీచర్ తో కొత్త ఫోన్ వస్తోంది.!

ఈ జియో బడ్జెట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ తో యూజర్లు కాలింగ్ సౌలభ్యం మాత్రం లభించదు. అయితే, కాలింగ్ కోసం కాకుండా డేటా మరియు ఎంటర్టైన్మెంట్ కోసం అతి తక్కువ ధరలో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఈ ప్లాన్ అందించే 12 ఓటీటీ ప్లాట్ ఫామ్ లిస్ట్ ను క్రింద చూడవచ్చు.

Jio Top Plan with 120tt subscription

JioTV app ద్వారా Sony LIV, ZEE5, జియోసినిమా ప్రీమియం, Liongate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal, Docubay, EPIC ON మరియు Hoichoi తో కలిపి మొత్తం 12 ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :