జియో సూపర్ ప్లాన్ ఇక ఒక్కచోటే అన్ని సర్వీసులు

HIGHLIGHTS

ఇంటర్నెట్, వాయిస్ కాల్స్, జీయో టీవీ సబ్ స్క్రిప్షన్ మరియు జియో ఆప్స్ అన్నింటిని కూడా కేవలం ఒకే ప్లానుతో

ముకేష్ అంబానీ నేతృత్వంలోని సంస్థ, దాని రిలయన్స్ జియో గిగా ఫైబర్ FTTH సేవని త్వరలోనే తీసుకురావాలని చూస్తోంది. ఈ సంస్థ ఇంటర్నెట్, వాయిస్ కాల్స్, జీయో టీవీ సబ్ స్క్రిప్షన్  మరియు జియో ఆప్స్ అన్నింటిని కూడా కేవలం ఒకే ప్లానుతో అందించేలా, ఒక కొత్త "ట్రిపుల్ ప్లే" ప్లాన్ను తీసుకురావడానికి చూస్తున్నట్లు, తెలుస్తోంది. టెలికాం రంగంలో,  ఎవరూ ఊహించని ధరలతో 4 జి సేవలను మార్కెట్లోకి తీసుకొచ్చిన జియో .

ప్రస్తుతానికి  ఈ ట్రిపుల్ ప్లే ప్లాన్ గురించి పూర్తిగా వివరాలు తెలియరాలేదు కానీ, జియో యొక్క వెబ్సైట్  Jio GigaFiber ఖాతాలో లాగ్ ఇన్ అయినప్పుడు కనిపించింది. అయితే, ఈ ప్లాన్ ధర ఇంకా తెలియరాలేదు. ఈ నివేదిక ప్రకారం, GigaFiber ట్రిపుల్ ప్లాన్ 100GB హై-స్పీడ్ డేటా (100 Mbps వేగంతో), అపరిమిత వాయిస్ కాలింగ్,  Jio ఆప్స్ యొక్క పోర్ట్ఫోలియో యాక్సెస్ మరియు Jio Home TV సబ్ స్క్రిప్షన్ని అందిస్తుంది. జీయో హోమ్ టివి సబ్ స్క్రిప్షన్ గురించి ప్రస్తావిస్తూ, సంస్థ యొక్క IPTV సేవను Jio Home TV అని పిలుస్తారని తెలిపింది. ఈ ప్లాన్ ఒక 28-రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

జీయో ఫైబర్ వెబ్సైట్ ప్రకారం, రోజుకు 500GB డేటా పరిమితితో వినియోగదారులకు 50MBPS వేగం అందించే ఒక ప్రాథమిక రూ.500 ప్లాన్ ఉంది. అలాగే, రూ. 999 ప్లానుతో 30 రోజులకుగాను 100MBPS స్పీడ్ మరియు 600GB డేటాను అందిస్తుంది. అయితే, భారీస్థాయిలో ఇంటర్నెట్ వినియోగం అవసరమున్న  వారికి 150 MBPS వేగంతో, 900 GB డేటా మరియు 30 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది, అదికూడా  కేవలం 1,500 రూపాయల వరకు ఎంపిక చేసుసుకునే విధంగా.

Jio సంస్థ, ఇప్పటికే ముంబై మరియు ఢిల్లీ వంటి నగరాల్లో దాని FTTH సేవలను పరీక్షించడం జరిగింది మరియు వాణిజ్యపరంగా త్వరలోనే భారతదేశం అంతటా దాని సేవలను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఈ టెస్ట్ నిర్వహించడంలో కొంత ఆలస్యం అయిందని ఒక నివేదిక పేర్కొంది మరియు సంస్థ తన GigaFiber సేవ కోసం  (RFS) అమ్మకానికి కోసం సిద్ధంగా ఉంది. ఏరియా RFS అంటే,  ప్రధానంగా అధికారకంగా సేవలను గురించి చెప్పటానికి మరియు ఈ విస్తరణను ప్రజలకు అందించదానికి సిద్దమవుతున్నట్లు అర్థం.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :