Jio Super Plan which offers unlimited 5g data calling and more benefits
Jio Super Plan: రిలయన్స్ జియో యూజర్లకు రోజుకు రూ. 10 రూపాయల ఖర్చుతో Unlimited 5G డేటా, కాలింగ్ మరియు మరిన్ని లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఇటీవల పెరిగిన టారిఫ్ రేట్లు తో యూజర్లు చవక ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జ్ చేయడానికి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. అయితే, ఈ ప్లాన్స్ అన్లిమిటెడ్ 5G డేటా మరియు కాలింగ్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ అయ్యి ఉండాలి. అందుకే, జియో యూజర్లకు తక్కువ ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ గురించి ఈరోజు చూద్దాం.
రిలయన్స్ జియో ఇటీవల అందించిన రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్లకు అతి చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం రూ. 899 రూపాయలకే 90 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. అంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 9.90 పైసలు ఖర్చుతో ఈ అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది.
వాస్తవానికి, గతంలో అందించిన అన్లిమిటెడ్ ప్లాన్స్ రేట్ లతో పోలిస్తే ఇది అధికమైన రేటు అయినా, ప్రస్తుతం జియో ఆఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్ లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీచార్జ్ చేస్తే మూడు నెలల పాటు నిశ్చింతగా ఉండొచ్చు.
Also Read: Sony 5.1 Soundbar ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది.!
జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ మూడు నెలల ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా ఆఫర్ చేస్తుంది. 4జి నెట్ వర్క్ పై రోజుకు 2GB డేటా చొప్పున 90 రోజులకు 180 GB ల డేటా మరియు 20 GB ఉచిత డేటా కలుపుకొని టోటల్ 200 GB డేటా అందిస్తుంది.
ఇది కాకుండా, ఈ జియో మూడు నెలల ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందుతుంది. అలాగే, జియో సినిమా, జియో క్లౌడ్ మరియు జియో టీవీ యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.
మరిన్ని ప్రీపెయిడ్ ప్లాన్ లను చెక్ చేయడానికి మరియు మొబైల్ రీఛార్జ్ చేయడానికి Click Here