జియో సునామి: రూ.98 కే డైలీ 1.5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్

HIGHLIGHTS

జియో కస్టమర్లకు శుభవార్త

కస్టమర్లకు ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే ప్లాన్

అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ అధిక డేటా

జియో కస్టమర్లకు శుభవార్త. ఎప్పటి కొత్త ప్లాన్స్ ప్రకటిస్తూ జియో తన కస్టమర్లను సర్ప్రైజ్ చేస్తోంది. కస్టమర్లకు ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే ప్లాన్ ను తిరిగి యాడ్ చేసింది. గత నెలలో డబుల్ బెనిఫిట్స్ తో రెండు కొత్త ప్రీపెయిడ్  ప్లాన్స్ ప్రకటించిన జియో, వీటికి జతగా మరొక చవక ప్రీపెయిడ్ ప్లాన్ జత చేసింది. ఈ రూ. 98 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అధిక లాభాలతో వస్తుంది. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ అధిక డేటాతో వస్తుంది.

Jio రూ. 98 ప్లాన్ ప్రయోజనాలు

ఈ  Jio రూ. 98 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ బెనిఫిట్స్ తో వస్తుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌలభ్యం అందుతుంది. అలాగే, రోజుకు 1.5 GB హై స్పీడ్ 4G డేటా కూడా లభిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ఈ Jio రూ. 98 ప్లాన్ తో ఎటువంటి ఉచిత SMS సర్వీస్ ను ఇవ్వడం లేదు. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అంటే, 14 రోజులకు గాను మొత్తంగా 21GB హై స్పీడ్ డేటాని అందుకుంటారు.

ఇక ఇటీవల ప్రకటించిన కొత్త రూ.39  మరియు రూ.39 ప్లాన్స్ విషయానికి వస్తే, రూ.39 ప్రీపెయిడ్ ప్లాన్ తో మీకు రోజు 100MB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అధనంగా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్  సౌకర్యం కూడా లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ తరువాత స్పీడ్ లిమిట్ 64Kbps కు తగ్గించబడుతుంది. అయితే,ఈ ప్లాన్ ముగిసిన తరువాత మరొక ప్లాన్ మీకు ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ ముగిసిన తరవాత దాన్ని వాడుకోవచ్చు.

ఇక రూ.69 ప్రీపెయిడ్ ప్లాన్ తో మీకు రోజు 512MB హై  స్పీడ్ డేటా లభిస్తుంది. అధనంగా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్  సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ తో రోజుకు 100SMS లు మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ తరువాత స్పీడ్ లిమిట్ 64Kbps కు తగ్గించబడుతుంది.

మరిన్ని బెస్ట్ JIO ప్లాన్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :