jio prepaid plans list which not offering unlimited 5g data from 3rd July 2024
Jio యూజర్లకు బ్యాడ్ న్యూస్ అందించింది. ఎప్పుడూ గుడ్ న్యూస్ లను అందించే జియో, ఈసారి యూజర్లకు బ్యాడ్ న్యూస్ అందించింది. ఇప్పటివరకు 5G స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు జియో యూజర్లు అన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన Unlimited 5G డేటాని ఎంజాయ్ చేశారు. అయితే, రిలయన్స్ జియో లెక్క ఇప్పుడు మారింది. ఇక నుండి ఈ ప్లాన్స్ పైన అన్లిమిటెడ్ 5G డేటా ఆఫర్ చేయడం లేదు అంటూ జియో ప్రకటించింది. జూలై 3వ తేదీ నుంచి ఈ కొత్త లెక్క మొదలయ్యింది.
జూలై 3 నుంచి టారిఫ్ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించిన జియో అదే రోజు నుంచి చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన అన్లిమిటెడ్ 5జీ డేటా సర్వీసులను నిలిపివేస్తున్నట్లు కూడా తెలిపింది. అంటే, జియో ప్లాన్స్ పైన రేట్లు పెంచడమే కాకుండా, అన్లిమిటెడ్ డేటాని కూడా నిలిపి వేసిందన్న మాట. రోజు అన్లిమిటెడ్ డేటా ఎంజాయ్ చేసే వారికి ఇంతకంటే పెద్ద బ్యాడ్ న్యూస్ ఏమైనా ఉంటుందా చెప్పండి. ఇక కొత్త ప్లాన్ అప్డేట్ ప్రకారం, జూలై 3 నుంచి 2GB కంటే తక్కువ డైలీ డేటా కలిగిన ప్లాన్స్ పై జియో అన్లిమిటెడ్ 5జి డేటా లభించదు.
అంతేకాదు, చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన కొత్త టారిఫ్ రేట్లు ఆపాదించింది. ఇప్పుడు కొత్త ప్లాన్ తో రీఛార్జ్ చేయాలనుకుంటే అన్లిమిటెడ్ డేటా కోసం అధిక రేటు తో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్ లను ఎంచుకొవాల్సి ఉంటుంది.
Also Read: టాప్ క్లాస్ Sony కెమెరాలతో వస్తున్న Realme 13 Pro Series 5G
జియో యొక్క ప్రీపెయిడ్ ప్లాన్ లలో ఏవైతే డైలీ 2GB కంటే తక్కువ డైలీ డేటాతో వస్తాయో, ఆ ప్లాన్స్ పైన అన్లిమిటెడ్ 5జి డేటా ఆఫర్ లభించదు. ఇందులో రూ. 199, రూ. 239, రూ. 299, రూ. 319, రూ. 329, రూ. 579, రూ. 666, రూ. 799 మరియు రూ. 889 ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన అన్లిమిటెడ్ 5జి డేటా లభించదు. అలాగే, డేటా ప్యాక్స్ మరియు సరసమైన ప్లాన్స్ (రూ. 1,899, రూ. 479, మరియు రూ. 189) ప్లాన్ పైన కూడా అన్లిమిటెడ్ 5జి డేటా లభించదు.
పైన తెలిపిన ప్లాన్స్ కొత్త టారిఫ్ ప్లాన్స్ మరియు ఈ ప్లాన్స్ పాత ప్రీపెయిడ్ ప్లాన్స్ స్థానంలో కొసాగుతున్నాయి. మొబైల్ రీఛార్జ్ కోసం Click Here