Jio అఫర్ చేస్తున్న పాపులర్ మొబైల్ ప్లాన్స్ గురించి తెలుసా..!

HIGHLIGHTS

రిలయన్స్ జియో తన యూజర్ల కోసం అన్ని కేటగిరీలలో తగిన ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది

Jio అఫర్ చేస్తున్న పాపులర్ మొబైల్ ప్లాన్స్

కాలింగ్, డేటా మరియు మరిన్ని ప్రయోజనాలను తీసుకువచ్చే బెస్ట్ ప్లాన్స్

Jio అఫర్ చేస్తున్న పాపులర్ మొబైల్ ప్లాన్స్ గురించి తెలుసా..!

రిలయన్స్ జియో తన యూజర్ల కోసం అన్ని కేటగిరీలలో తగిన ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. వీటిలో Jio అఫర్ చేస్తున్న పాపులర్ మొబైల్ ప్లాన్స్ గురించి మీకు తెలుసా? తెలియకుంటే, ఈరోజు జియో అఫర్ చేస్తున్న పాపులర్ మొబైల్ ప్లాన్స్ గురించి ఇక్కడ చూడవచ్చు. కాలింగ్, డేటా మరియు మరిన్ని ప్రయోజనాలను తీసుకువచ్చే ఆ బెస్ట్ ప్లాన్స్ ఏమిటో ఈరోజు చూద్దాం. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

జియో యొక్క పాపులర్ మొబైల్ ప్లాన్స్ గురించి వివరిస్తూ తన వెబ్సైట్ నుండి ఒక మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ ను వెల్లడించింది.  అవి రూ.299, రూ.719 మరియు రూ.2,999 మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్. ఈ మూడు పాపులర్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తున్న ప్రయోజనాలను క్రింద చూడవచ్చు. 

Jio Rs.299 Plan

జియో అఫర్ చేస్తున్న పాపులర్ మొబైల్ ప్లాన్ లలో ఇది తక్కువ  ధరలో వచ్చే 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. డేటా విషయానికి వస్తే, డైలీ 2GB డేటాతో 28 రోజుల వ్యాలిడిటీకి టోటల్ 56GB హై స్పీడ్ డేటాని అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 100 SMS ల వినియోగ ప్రయోజనం కూడా లభిస్తుంది. అలాగే, అన్ని జియో యాప్స్ కి వ్యాలిడిటీ కాలానికి ఉచిత యాక్సెస్ ని అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, 5G నెట్ వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాలలోని ఎలిజిబుల్ యూజర్లకు అన్లిమిటెడ్ 5G డేటాని కూడా అందిస్తుంది. 

Jio Rs.719 Plan 

ఈ ప్లాన్ జియో అఫర్ చేస్తున్న పాపులర్ లాంగ్ వ్యాలిడిటీ మొబైల్ ప్లాన్ మరియు ఇది 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా మీకు పూర్తి చెల్లుబాటు కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం అందుతుంది. డేటా పరంగా, డైలీ 2GB హై స్పీడ్ డేటాతో 84 రోజుల చెల్లుబాటు కాలానికి గాను 168GB డేటాని అందిస్తుంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS వినియోగాన్ని మరియు అన్ని జియో యాప్స్ కి యాక్సెస్ ని అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ కూడా ఎలిజిబుల్ యూజర్లకు అన్లిమిటెడ్ 5G డేటా వినియోగ ప్రయోజనాన్ని అఫర్ చేస్తుంది. 

Jio Rs.2,999

ఇక చివరి ప్లాన్ రూ.2,999 ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ జియో అఫర్ చేస్తున్న మోస్ట్ లవ్డ్ మరియు పాపులర్ మొబైల్ ప్లాన్ గా జియో చెబుతోంది. ఎందుకంటే, ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మరియు SMS ప్రయోజనాలతో పాటుగా అదనపు వ్యాలిడిటీ, డేటా లను కూడా తీసుకువస్తుంది. 

వివరాల్లోకి వెళితే, ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో పాటుగా 23 రోజుల అదనపు వ్యాలిడిటీని కూడా తీసుకువస్తుంది. అంటే, టోటల్ 388 రోజులు ఈ ప్లాన్ చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు పూర్తి చెల్లుబాటు కాలానికి డైలీ 2GB డేటాతో టోటల్ 912.5 మరియు 75GB అదనపు డేటా కలిపి మొత్తం 987.5 GB ల హై స్పీడ్ డేటాని అందిస్తుంది. అలాగే, సంవత్సరం మొత్తం డైలీ 100 SMS వినియోగం మరియు అన్ని జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ అందిస్తుంది. పైన రెండు ప్లాన్స్ మాదిరిగానే ఈ ప్లాన్ కూడా అర్హత కలిగిన కస్టమర్లకు అన్లిమిటెడ్ 5G డేటా వినియోగయాక్సెస్ ని అందిస్తుంది.

మరిన్ని జియో బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo