Jio Plan which offers jio hotstar and unlimited benefits under budget
Jio Plan: రిలయన్స్ జియో యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ చాలానే అందించింది. అందులో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఒకదాని చూడనున్నాము. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందించడమే కాకుండా జియో హాట్ స్టార్ యొక్క ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. జియో ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాలు ఏమిటో చూద్దామా.
రిలయన్స్ జియో యొక్క రూ. 949 ప్రీపెయిడ్ ప్లాన్ పైన తెలిపిన అన్ని ప్రయోజనాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఎంటర్టైన్మెంట్ తో సహా కంప్లీట్ బెనిఫిట్స్ అందిస్తుంది. మరి ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్ అందుకునే పూర్తి ప్రయోజనాలు ఏమిటో చూద్దామా.
Also Read: Flipkart Sale: భారీ డిస్కౌంట్ తో తక్కవ ధరకే లభిస్తున్న 65 ఇంచ్ QLED Smart Tv
జియో యొక్క ఈ రూ. 949 రూపాయల దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా అందుకుంటారు. డిడ్ మాత్రమే కాదు ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసే యూజర్లు డైలీ 100SMS వినియోగ ప్రయోజనం మరియు 4G నెట్ వర్క్ పై డైలీ 2GB డేటా కూడా అందుకుంటారు.
ఇప్పటి తెలిపినవి రెగ్యులర్ ప్రయోజనాలు కాగా మరో మూడు ఉచిత ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్ అందిస్తుంది. అవేమిటంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 84 రోజుల Jio Hotstar ఉచిత సబ్ స్క్రిప్షన్ తో పాటు జియో టీవీ మరియు జియో క్లౌడ్ ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.