Jio 5G Offer: వినియోగదారులకు 5G ప్లాన్ అందించిన జియో.!

HIGHLIGHTS

వినియోగదారులకు 5G ప్లాన్ అందించిన జియో

5G నెట్ వర్క్ ను శరవేగంగా విస్తరిస్తున్న రిలయన్స్ జియో

5G అందుబాటులో ఉన్న నగరాలలో ఈ ప్లాన్ ను రీఛార్జ్ లాభాలను పొందవచ్చు

Jio 5G Offer: వినియోగదారులకు 5G ప్లాన్ అందించిన జియో.  దేశవ్యాప్తంగా 5G నెట్ వర్క్ ను శరవేగంగా విస్తరిస్తున్న రిలయన్స్ జియో వినియోగదారుల కోసం 5G ప్లాన్ ను కూడా అందించింది. 5G అందుబాటులో ఉన్న నగరాలలో ఈ ప్లాన్ ను రీఛార్జ్ లాభాలను పొందవచ్చు. నిన్న కూడా మన తెలుగు రాష్ట్రాలలో 9 నగరాలలో కొత్తగా 5G నెట్ వర్క్ ను లాంచ్ చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోని మొత్తం 31 నగరాలలో ఈ Jio True 5G సర్వీస్ లు అందిబాటులోకి వచ్చాయి. కాబట్టి, 5G నెట్ వర్క్ అందుకున్న కస్టమర్లు ఈ ప్లాన్ ప్రయోజనాలను ఆనందించవచ్చు.  

జియో ఇటీవల ప్రకటించిన రూ.61 డేటా ప్లాన్ గురించే మనం మాట్లడుకుంటోంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు 5G స్పీడ్ తో డేటాని పొందవచ్చు. అంటే, కేవలం 10 రూపాయలకే 1GB హై స్పీడ్ 5G డేటా మీకు అందిస్తుంది. ఈ ప్లాన్ అఫర్ చేస్తున్న ప్రయోజనాలు మరియు ఏ ప్లాన్ లతో పాటుగా ఈ 5G అప్గ్రేడ్ ప్లాన్ వర్తిస్తుందో వివరంగా తెలుసుకుందాం. 

వాస్తవానికి, మీరు ఉపయోగిస్తున్న 4G సిమ్ కార్డ్ తోనే మీరు 5G సర్వీసులను పొందవచ్చు. అంతేకాదు, ప్రస్తుతం వాడుకలో ఉన్న ప్లాన్స్ పైనే 5G సేవలను ఉపయోగించుకోవచ్చని కూడా పేర్కొంది. అయితే, ఇటీవలే, రిలయన్స్ జియో కొత్త Jio 5G Upgrade Plan ను యూజర్ల కోసం అందించింది.

Jio 5G Upgrade Plan:

జియో ప్రకారం, ఈ జియో 5G అప్గ్రేడ్ ప్లాన్ కేవలం రూ.61 రూపాయలకే లభిస్తుంది. ఈ పాన్ తో మీకు 6GB అన్లిమిటెడ్ 5G డేటా అందుతుంది. ఈ డేటా ఎటువంటి ఉపయోగానికి లిమిట్ లేదు. మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీ కాలం వరకూ ఈ డేటాని ఉపయోగించుకోవచ్చు. లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది. అయితే, ఇది ఏ ప్రాంతాల్లో అయితే Jio 5G సర్వీస్ అందుబాటులో ఉన్నదో వారికీ మాత్రమే వర్తిస్తుంది. అంటే, ఇప్పటి వరకూ True Jio 5G లాంచ్ చేయబడిందో, ఆ సిటీలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

 ఈ జియో 5G అప్గ్రేడ్ ప్లాన్ కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన మాత్రమే యాడ్ ఆన్ గా జతచేసే వీలుంది. జియో తెలిపిన ప్రకారం, రూ.119, రూ.149, రూ.179, రూ.199 మరియు రూ.209 ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన మాత్రమే ఈ జియో Jio 5G Upgrade Plan యాడ్ ఆన్ గా రీచార్జ్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :