jio limited offer closes on tomorrow
2025 కొత్త సంవత్సరం సందర్భంగా రిలయన్స్ జియో అందించిన Jio Limited Offer రేపటితో క్లోజ్ అవుతోంది. Jio New Year Offer 2025 పేరుతో తీసుకు వచ్చిన ఈ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ 200 రోజులు అన్లిమిటెడ్ లాభాలతో పాటు రూ. 2150 రూపాయల విలువైన అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తుంది. అయితే, ఈ లిమిటెడ్ ఆఫర్ రేపటితో ముగిసిపోతుంది.
రిలయన్స్ జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను 11 డిసెంబర్ 2024 న విడుదల చేసింది మరియు ముందు 11 జనవరి 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను జనవరి 31 వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఇప్పుడు రేపటితో ముగిసిపోతుంది.
ఈ జియో రూ. 2,025 ప్రీపెయిడ్ ప్లాన్ తో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ఆఫర్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 365 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది. అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు సంవత్సరం మొత్తం డైలీ 2.5GB డేటా మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీచార్జ్ చేసే యూజర్లకు 365 రోజులు పాటు Jio True 5G నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5G డేటా అందిస్తుంది.
ఇక ఈ జియో లిమిటెడ్ ఆఫర్ అందించే అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రూ. 2150 రూపాయల విలువైన అదనపు లాభాలు అందిస్తుంది. EaseMyTrip పై బుక్ చేసే ఫ్లైట్ టికెట్స్ పౌ రూ. 1,500 డిస్కౌంట్, AJIO పై రూ. 2,999 పైగా చేసే షాపింగ్ పై రూ. 500 తగ్గింపు మరియు స్విగ్గీ పై రూ. 499 పైబడి చేసే ఆర్డర్స్ పై రూ. 150 అదనపు తెగింపు అందిస్తుంది.
Also Read: UPI New Rules: ఫిబ్రవరి 1 నుంచి ఈ యూపీఐ అకౌంట్స్ నుంచి పేమెంట్ చెయ్యలేరు.. ఎందుకంటే.!
మరిన్ని బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here