jio launches new rs 999 prepaid plan replaces old plan with more benefits
Jio యూజర్లకు గుడ్ న్యూస్: టారిఫ్ రేట్లు పెరిగిన తరువాత మంచి రీఛార్జ్ ప్లాన్ ఎంచుకునే అవకాశం కరువైన తరుణంలో జియో కొత్త ప్లాన్ ప్రకటించింది. గతంలో ఉన్న ప్లాన్ రేటుకే మరిన్ని ప్రయోజనాలతో ఒక కొత్త ప్లాన్ ను అందించింది. ఒక విధంగా చెప్పాలంటే పాత ప్లాన్ రేట్ లో కొత్త ప్లాన్ ను రీప్లేస్ చేసిందని కూడా చెప్పొచ్చు. జియో కొత్తగా తెచ్చిన ప్లాన్ మరియు ఇదే రేటులో ముందుగా లభించిన ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.!
రిలయన్స్ జియో కొత్తగా రూ. 999 ప్లాన్ ను అందించింది. ఈ ప్లాన్ ను గతంలో ఇదే ధరలో లభించిన ప్రీపెయిడ్ ప్లాన్ స్థానంలో అందించింది. అయితే, టారిఫ్ రేట్లు పెరిగిన తరువాత ఆ ప్లాన్ ఇప్పుడు రూ. 1,199 ధరకు లభిస్తోంది. అయితే, ఈ రెండు ప్లాన్స్ అందించే ప్రయోజనాలలో పెద్దగా మార్పులు లేవు.
జియో కొత్తగా తెచ్చిన ఈ రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ 98 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ తో 98 లకు గాను అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో డైలీ 2GB చొప్పున 196GB ల 4G డేటా మరియు Jio ture 5G నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే, రోజుకు 100 SMS ల ఉపయోగ ప్రయోజనం అంధిస్తుంది. వీటితో పాటు జియో సినిమా, జియో టీవీ మరియు జియో క్లౌడ్ లకు ఉచిత యాక్సెస్ అందిస్తుంది.
Jio New Plan vs old plan
ఈ ప్లాన్ ముందుగా రూ. 999 ధరకే లభించేది. అయితే, టారిఫ్ రేట్లు పెరిగిన తరువాత ఈ ప్లాన్ ఇప్పుడు రూ. 1,199 ధరకు లభిస్తోంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ రోజు 3GB డేటా చొప్పున టోటల్ 252GB మరియు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ తో రోజు 100 SMS మరియు 5G నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటా ప్రయోజనాలు అందిస్తుంది. వీటితో పాటు జియో సినిమా, జియో టీవీ మరియు జియో క్లౌడ్ లకు ఉచిత యాక్సెస్ అందిస్తుంది.
Also Read: Flipkart Goat Sale నుంచి భారీ డిస్కౌంట్ తో 22 వేలకు లభిస్తున్న 50 ఇంచ్ Smart Tv లు ఇవే.!
ఒక రకంగా చూస్తే, కొత్త రూ. 999 ప్లాన్ ఎక్కువ వ్యాలిడిటీ మరియు అన్లిమిటెడ్ 5జి డేటా వంటి ప్రయోజనాలు అందిస్తుంది. అయితే, 4జి నెట్ వర్క్ పైన డైలీ అధిక డేటా కోరుకునే వారికి రూ. 1,198 ప్లాన్ ఉపయోగపడుతుంది.
మీ మొబైల్ నెంబర్ రీఛార్జ్ కోసం లేదా ప్లాన్స్ చెక్ చేయడానికి Click Here