Jio 5G: ఆంధ్రప్రదేశ్ లోని మరో 9 ప్రాంతాల్లో 5G నెట్ వర్క్ లాంచ్.!

HIGHLIGHTS

ఆంధ్రప్రదేశ్ లోని మరో 9 ప్రాంతాల్లో 5G నెట్ వర్క్ లాంచ్ చేసింది

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 34 ప్రాంతాల్లో 5G సర్వీస్ లను ప్రారంభించిన రిలయన్స్ జియో

ఇప్పుడు మరో 9 ప్రాంతాల్లో Jio 5G సేవలను ప్రారంభించింది

Jio 5G: ఆంధ్రప్రదేశ్ లోని మరో 9 ప్రాంతాల్లో 5G నెట్ వర్క్ లాంచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే 34 ప్రాంతాల్లో 5G సర్వీస్ లను ప్రారంభించిన రిలయన్స్ జియో ఇప్పుడు మరో 9 ప్రాంతాల్లో Jio 5G సేవలను ప్రారంభించింది. రిలయన్స్ జియో 5G నెట్ వర్క్ తెలుగు రాష్ట్రాల్లో చాలా వేగంగా విస్తరిస్తోంది మరియు ఇప్పటికే రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో Jio 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి.   

ఇక కొత్తగా 5G నెట్ వర్క్ అందుకున్న ప్రాంతాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ లోని ఆదోని, బద్వేల్, చిలకలూరిపేట, గుడివాడ, కదిరి, నర్సాపూర్, రాయచోటి, శ్రీకాళహస్తి మరియు తాడేపల్లిగూడెం సిటీలలో జియో 5G సేవలు మొదలయ్యాయి. అంటే, ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఈ ప్రాంతాలలోని జియో కస్టమర్లు ఇప్పుడు వేగవంతమైన Jio 5G సర్వీస్ ను ఆనందించవచ్చు. 

ఈ నగరాల్లోని ప్రజలు 'JIO WELCOME OFFER' అఫర్ లో భాగంగా 1Gbps+ స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని పొందుతారని కూడా జియో వెల్లడించింది. దీనికోసం My Jio App నుండి 5G ఎనేబుల్ కోసం అధ్యర్ధన నమోదు చెయ్యవలసి ఉంటుంది.      

మీరు Jio True 5G సేవలను వినియోగించుకోవడానికి మీ సిమ్ కార్డును మార్చవలసిన అవసరం లేదు మరియు ఈ సర్వీసులను మీ 4G సిమ్ కార్డ్ పైనే ఆనందించవచ్చు. అంతేకాదు, 4G ప్లాన్స్ పైనే మీరు 5G ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక మీ 5G ఫోన్ లో 5G నెట్ వర్క్ సెట్ చేసుకోవడానికి, ఫోన్ మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి,సిమ్ కార్డు ఎంచుకొన్న తరువాత 'Preferred network type' అప్షన్ ను ఎంచుకోండి. ఇక్కడ మీకు నెట్ వర్క్ టైప్ (3G,4G,5G) చూపిస్తుంది. మీ నెట్ వర్క్ టైప్ ను 5G గా ఎంచుకోండి మరియు మీకు 5G నెట్ వర్క్ ఎనేబుల్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :