జియో యూజర్లకు మరింత డేటా అఫర్ చేసే అన్లిమిటెడ్ ప్లాన్స్.!

HIGHLIGHTS

జియో తన యూజర్లకు అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్ చాలానే అందించింది

డైలీ అధిక డేటా మరియు ఇతర లాభాలను కోరుకునే వారి కోసం గొప్ప ప్లాన్స్

అన్లిమిటెడ్ జియో 5G డేటా ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు

రిలయన్స్ జియో తన యూజర్లకు అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్స్ చాలానే అందించింది. డైలీ అధిక డేటా మరియు ఇతర లాభాలను కోరుకునే వారి కోసం కూడా గొప్ప ప్లాన్స్ జియో కలిగివుంది. రోజు ఎక్కువ డేటా కోరుకునే వారిలో మీరు కూడా ఉన్నట్లయితే డైలీ 2.5 GB హై స్పీడ్ డేటా అఫర్ చేసే ఈ ప్లాన్స్ ను మీరు పరిశీలించవచ్చు. అంతేకాదు, ఈ ప్లాన్స్ తో ఎలిజిబిలిటి కలిగిన యూజర్లు అన్లిమిటెడ్ జియో 5G డేటా ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. 

Jio Rs.349 Plan

జియో కొత్తగా  ఈ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 30 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తి 30 రోజుల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.                

Jio Rs.899 Plan

జియో యొక్క లేటెస్ట్ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 225 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.

Jio Rs.2,023 Plan

జియో కొత్త రూ.2,023  ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ 252 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 630 GB డేటాని డేటాని కూడా అఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

Jio Rs.2,999 Plan

జియో రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనంతో వస్తుంది. ఈ ప్లాన్ ముందు నుండే 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుండగా, న్యూ ఇయర్ అఫర్ లో భాగంగా 23 రోజుల ఎక్ట్రా వ్యాలిడిటీని కూడా జత చేసింది మరియు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 912.5 GB డేటాని మరియు 75 అధనపు డేటాని కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా లిమిట్ ముగిసిన తరువాత వేగం 64Kbps కి తగ్గించ బడుతుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది. అలాగే, జియో యొక్క అన్ని యాప్స్ కి ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

మరిన్ని జియో బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :