Jio: రోజుకు రూ.8 ఖర్చుతోనే డైలీ 1.5 హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ అందుకోండి.!

HIGHLIGHTS

జియో కస్టమర్లకు అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్

ఈ జియో ప్లాన్ మరిన్ని లాభాలను అందిస్తుంది

ఈ ప్లాన్ కోసం రోజుకు రూ.8 మాత్రమే ఖర్చవుతుంది

జియో కస్టమర్లకు రోజు కేవలం రూ.8 ఖర్చుతోనే డైలీ 1.5 హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా మరిన్ని ఇతర లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ అందించింది. అదే, రిలయన్స్ జియో యొక్క రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ మరిన్ని లాభాలను అందిస్తుంది. మరి జియో అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి పూర్తిగా తెలుసుకుందామా. 

Jio Rs.666 Plan

రిలయన్స్ జియో యొక్క ఈ Rs.666 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. అంతేకాదు, డైలీ 1.5 GB హై స్పీడ్ డేటా ని కూడా ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లు అందుకుంటారు. అలాగే, డైలీ 100SMS సౌకర్యాన్ని కూడా ఈ ప్లాన్ అఫర్ చేస్తుంది దీనితో పాటుగా అన్ని జియో యాప్స్ కి కాంప్లీమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. ఇక్కడితో అయిపోలేదు, 5G నెట్ వర్క్ అందుబాటులో ఉండి అర్హత కలిగిన కస్టమర్లకు అన్లిమిటెడ్ 5G డేటా ప్రయోజనాన్ని కూడా ఈ ప్లాన్ అందిస్తుంది. 

అధిక ప్రయోజనాలను అందించే ఇటివంటి మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కోసం చూస్తే, రూ.349 మరియు రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్స్ లను పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ రెండు ప్లాన్స్ కూడా పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ మరియు అధిక డేటాని అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్ పరిధిలోకి వస్తాయని చెప్పవచ్చు. ఈ ప్లాన్స్ అందించే ప్రయోజనాలను ఈ క్రింద చూడవచ్చు.          

Jio Rs.349 Plan

జియో యొక్క లేటెస్ట్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 30 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 75GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అదనంగా, 121 రూపాయల విలువ చేసే 12GB హై స్పీడ్ డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తి నెల రోజుల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు.  

Jio Rs.899 Plan

జియో యొక్క లేటెస్ట్ రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5GB డేటా చొప్పున 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 225 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అదనంగా, 121 రూపాయల విలువ చేసే 12GB హై స్పీడ్ డేటాని కూడా ఉచితంగా అందిస్తోంది. అలాగే, డైలీ 100 ఉచిత SMS లు మరియు అన్ని జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది. పూర్తిగా మూడు నెలల వ్యాలిడిటీ మరియు అధిక డేటా ఈ ప్లాన్ తో అందుకోవచ్చు. మరిన్ని Jio ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :