Netflix మరియు Amazon సబ్ స్క్రిప్షన్ అందించే జియో బెస్ట్ ప్లాన్స్.!

HIGHLIGHTS

Netflix మరియు Amazon సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా బెస్ట్ ప్లాన్స్ కూడా జియో తన కస్టమర్ల కు అఫర్ చేస్తోంది

అన్లిమిటెడ్ కాలింగ్, డేటాతో పాటుగా Netflix మరియు Amazon ఉచిత సబ్ స్క్రిప్షన్

ఈ ప్లాన్స్ మరియు ఇవి అందించే ప్రయోజనాలను తెలుసుకోండి

Netflix మరియు Amazon సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా బెస్ట్ ప్లాన్స్ కూడా జియో తన కస్టమర్ల కు అఫర్ చేస్తోంది. ఈ ప్లాన్స్ అన్లిమిటెడ్ కాలింగ్, డేటాతో పాటుగా Netflix మరియు Amazon ఉచిత సబ్ స్క్రిప్షన్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఈ ప్రయోజనాలను అందుకునే అవకాశం కేవలం పోస్ట్ పైడ్ కస్టమర్లకు మాత్రం వుంది. ఈ ప్లాన్ లను కేవలం పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం మాత్రమే జియో అందించింది. ఈ ప్లాన్స్ మరియు ఇవి అందించే ప్రయోజనాలను తెలుసుకోండి.     

Jio రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

జియో యొక్క ఈ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఒక నెల రెంటల్ ప్లాన్ మరియు ఇది బిల్ వ్యవధికి గాను 75 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS లిమిట్ కూడా వుంది. ఈ ప్లాన్ తో Netflix మరియు Amazon Prime Video లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా పొందుతారు. అంతేకాదు, మీరు 200 GB వరకు డేటాని రోల్ అవుట్ కూడా చేసుకోవచ్చు.

ఇదే లాభాలను అఫర్ చేసే మరొక రెండు ప్లాన్స్ ని కూడా అందించింది. ఇవి మీ ఫ్యామిలీ ప్లాన్స్ మరియు ఈ ప్లాన్స్ మీకు అధనపు SIM కార్డ్ ను కూడా తీసుకువస్తాయి. అందులో ఒకటి రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మరియు మరొకటి రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్. వీటిలో రూ.599 ప్లాన్ 1 సిమ్ కార్డ్ తో వస్తుంది. రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మాత్రం 2 అదనపు సిమ్ కార్డ్ లను తీసుకువస్తుంది. 

Note: పైన తెలిపిన అన్ని ప్లాన్ ధరలకు 18% GST ని కూడా కలుపుకోవలసి వుంటుంది. అంటే, Rs.399+18%GST, Rs.599+18%GST మరియుబ్ Rs.799+18%GST ఈ ప్లాన్ ధరగా గుర్తుంచుకోండి.      

మరిన్ని జియో బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :