Jio Plan: మూడు నెలల పాటు 14 OTT లు మరియు Unlimited 5G డేటా అందించే బెస్ట్ ప్లాన్.!

HIGHLIGHTS

మూడు నెలల పాటు 14 OTT లు మరియు Unlimited 5G అందించే Jio బెస్ట్ ప్లాన్

జియో లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్

జియో 2023 సంవత్సరం చివరిలో తీసుకు వచ్చిన కొత్త ఎంటర్టైన్మెంట్ ప్లాన్

Jio Plan: మూడు నెలల పాటు 14 OTT లు మరియు Unlimited 5G అందించే బెస్ట్ ప్లాన్ ను ఇటీవలే విడుదల చేసింది. ఈ కొత్త ప్లాన్ తో జియో యూజర్లు ఏకంగా మూడు నెలల పాటు 14 ప్రముఖ OTT లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ ను మరియు అన్లిమిటెడ్ 5జి డేటా యాక్సెస్ ని సైతం అందుకోవచ్చు. అంటే, ఈ జియో లేటెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో ఎంటర్టైన్మెంట్, డేటా మరియు కాలింగ్ వంటి అన్ని లాభాలను అందుకోవచ్చన మాట. మరింకెందుకు ఆలశ్యం, జియో అందించిన ఆ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఏమిటో తెలుసుకుందామా.

Jio Plan with 14 OTT and Unlimited 5G data

రిలయన్స్ జియో 2023 సంవత్సరం చివరిలో తీసుకు వచ్చిన కొత్త ఎంటర్టైన్మెంట్ ప్లాన్ రూ. 1,198 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఈ అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ తో 14 ఓటీటీలు మరియు అల్రౌండ్ లాభాలను అందిస్తుంది ఈ ప్లాన్ అందించే కంప్లీట్ ప్రయోజనాలను ఇక్కడ చూడవచ్చు.

Also Read : Realme 12 Pro Series: 120X జూమ్ కెమేరాతో కొత్త ఫోన్స్ లాంచ్ చేసిన రియల్ మి.!

జియో రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తిగా 84 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటా ఆనందాన్ని పొందవచ్చు. అయితే, 4జి నెట్ వర్క్ పైన మాత్రం రోజుకు 2GB డేటా చొప్పున 84 రోజులకు గాను 168 GB ల 4జి డేటా ని అందుకోవచ్చు. ఈ ప్లాన్ తో డైలీ 100SMS సౌలభ్యం మరియు జియో యాప్స్ కు ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.

ఇక ఈ ప్లాన్ తో లభించే మరిన్ని ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో Disney+Hotstar, Prime Video మొబైల్ ఎడిషన్ తో పాటుగా 84 రోజులు JioCinema Premium సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. అంతేకాదు, Sony LIV, ZEE5, Lionsgate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal, Docubay, EPIC మరియు Hoichoi తో కలిపి మొత్తం 14ఓటీటీ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :