జియో బెస్ట్ అఫర్: రూ.4199 ప్లాన్ తో వన్ ఇయర్ డైలీ 3GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందుకోవచ్చు

HIGHLIGHTS

రోజుకి రూ.11 ఖర్చుతో 3GB డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్

జియో యొక్క వన్ ఇయర్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్

అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది

డిసెంబర్ 1 నుండి జియో కొత్త రీఛార్జ్ రేట్లు అమలులోకి వచ్చాయి. పెరిగిన ధరల పైన కస్టమర్లు ఇప్పటికే సర్వత్రా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ కొత్త ధరలు ఎన్ని రోజులు కొనసాగుతాయో వేచి చూడాల్సి ఉంటుంది. అయితే, రూ.4199 ప్లాన్ తో వన్ ఇయర్ డైలీ 3GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందుకోవచ్చు , జియో యొక్క ఈ ప్లాన్ రోజుకి రూ.11 ఖర్చుతో 3GB డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటుగా మరిన్ని ప్రయోజనాలను అందిస్తోంది.

వాస్తవానికి, ఇది జియో యొక్క Rs.3499 పాత వన్ ఇయర్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్. ఇప్పుడు ఈ ప్లాన్ Rs.4,199 రూపాయలకు లభిస్తోంది. మరి ఈ ప్లాన్ అఫర్ చేసే ప్రయోజాలను చూద్దాం.                      

Jio Rs.4,199 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 3GB డేటాతో మొత్తం 1095 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అధనంగా, అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

అంటే, ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలలో ఎటువంటి మార్పు లేదు. కానీ, ఈ ప్లాన్ ధర మాత్రం 700 రూపాయలు పెరిగింది. ఇక తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందించే జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ గా పేరొందిన Rs.599 మరియు Rs.2599 ఇప్పుడు Rs.719 మరియు Rs.2879 ధరకు లభిస్తున్నాయి. ఇక వీటి ప్రయోజాలను ఈ క్రింద చూడవచ్చు.      

Jio Rs.719 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 168 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, 20% జియోమార్ట్ మహా క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

Jio Rs.2879 Plan

జియో యొక్క ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి సంవత్సరం అన్లిమిటెడ్ ప్రయోజాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB డేటాతో పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం 740 GB హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అంతేకాదు, రోజుకు 100 SMS లిమిట్ కూడా మీరు అందుకుంటారు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అన్ని జియో యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అధనంగా, డిస్ని ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది.

మరిన్ని బెస్ట్ Jio ప్లాన్స్ కోసం ఇక్కడ నొక్కండి  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :