Jio Happy New Year Plan announced with complete entertainment benefits
Jio Happy New Year Plan: 2026 కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ, రిలయన్స్ జియో తన యూజర్ల కోసం కొత్త ఆఫర్ అందించింది. రిలయన్స్ సరికొత్తగా అందించిన ఈ లేటెస్ట్ ఆఫర్ తో కేవలం 500 రూపాయల ధరలోనే అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా మరియు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ మొత్తం మూడు లాభాలు కూడా నెల మొత్తం అందుకోవచ్చు. మరి రిలయన్స్ జియో అందించిన ఈ కొత్త న్యూ ఇయర్ ఆఫర్ గురించి తెలుసుకుందామా.
రానున్న కొత్త సంవత్సరం సందర్భంగా రిలయన్స్ జియో ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను విడుదల చేసింది. అదే, జియో కొత్తగా విడుదల చేసిన రూ. 500 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్ల కోసం అందుబాటులోకి కూడా వచ్చింది. ఈ ప్లాన్ ను 2026 కొత్త సంవత్సర కానుకగా జియో యూజర్లకు అందించింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు జియో అందించే పూర్తి లాభాలు ఇప్పుడు చూద్దాం.
ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను డేట్, కాలింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ వంటి కంప్లీట్ బెనిఫిట్స్ తో జియో అందించింది. ఈ కొత్త రూ. 500 న్యూ ఇయర్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 28 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, ట్రూ 5జి నెట్వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా మరియు డైలీ 100 SMS వంటి రెగ్యులర్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఇది కాకుండా 4G నెట్ వర్క్ పై డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా కూడా అందిస్తుంది.
ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు అదనపు బెనిఫిట్ కూడా అందిస్తుంది. అదేమిటంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు జియో హాట్ స్టార్, సోనీ లివ్, జీ 5, యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్, లయన్స్ గేట్ ప్లే, సన్ నెక్స్ట్, కంచలంక ప్లానెట్ మరాఠీ, డిస్కవరీ ప్లస్, చౌపల్, హోయ్ చోయ్, ఫ్యాన్ కోడ్ OTT ఛానల్ కోసం ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.
Also Read: OnePlus 15R First Sale: వన్ ప్లస్ లేటెస్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ భారీ ఆఫర్స్ తో స్టార్ట్ అయ్యింది.!
ఈ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనాల లిస్ట్ ఇంతటితో అయిపోలేదు. ఈ ప్లాన్ తో రూ. 35,100 రూపాయల విలువైన గూగుల్ జెమిని AI ప్రో యాక్సెస్ కూడా మీకు అందిస్తుంది. ఇది అందించే బెనిఫిట్స్ మొత్తం చూస్తే, కాలింగ్, డేటా, AI, SMS మరియు ఎంటర్టైన్మెంట్ వంటి అన్ని లాభాలు అందించే కంప్లీట్ ప్లాన్ గా ఉంటుంది.