Jio Happy New Year 2026 new plans and offers announced
Jio Happy New Year 2026: కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా యూజర్ల కోసం కొత్త ప్లాన్స్ అందించింది. ఈ ప్లాన్స్ తన పోర్ట్ ఫోలియో లో జతగా చేసింది. వీటిలో కొత్త ప్లాన్ మరియు పాత ప్లాన్ లో కొత్త లాభాలు వంటివి కూడా అందించింది. జియో లేటెస్ట్ గా అందించిన ఈ ప్లాన్స్ మరియు కొత్త లాభాలు ఏమిటో తెలుసుకోండి.
రిలయన్స్ జియో యూజర్ల కోసం 2026 కానుకగా కొత్త ప్లాన్స్ మరియు బెనిఫిట్స్ అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా రూ. 500 రూపాయల అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్, రూ. 103 రూపాయల ఫ్లెక్సీ ప్లాన్ మరియు రూ. 3,599 రూపాయల ప్లాన్ లో అదనపు లాభాలు కూడా జత చేసింది.
రిలయన్స్ జియో కొత్తగా అందించిన రూ. 500 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజులు వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ 28 రోజులు అన్లిమిటెడ్ 5జి డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS అందిస్తుంది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తో అదనపు OTT ప్రయోజనాలు కూడా అందించింది. ఈ ప్లాన్ తో యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్, జియో హాట్ స్టార్, సోనీ లివ్, జీ 5, లయన్స్ గేట్ ప్లే, సన్ నెక్స్ట్, డిస్కవరీ ప్లస్, కంచలంక ప్లానెట్ మరాఠీ, చౌపల్, హోయ్ చోయ్, ఫ్యాన్ కోడ్ వంటి OTT ఛానల్స్ యాక్సెస్ అందిస్తుంది. ఇది కాకుండా 18 నెలల గూగుల్ జెమినీ ప్రో యాక్సెస్ కూడా ఉచితంగా అందిస్తుంది.
ఇది జియో కొత్తగా అందించిన డేటా ప్యాక్ ఆఫర్. ఇది 28 రోజులు చెల్లుబాటు అవుతుంది మరియు టోటల్ 5 జీబీ హై స్పీడ్ డేటా అందిస్తుంది. ఈ డేటా ప్యాక్ తో OTT యాక్సెస్ కోసం మై జియో యాప్ లో వోచర్ అందిస్తుంది. ఇందులో మూడు ఆప్షన్ లలో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు.
ఆప్షన్ 1 : జియో హాట్ స్టార్, సోనీ లివ్ మరియు జీ 5 సబ్ యాక్సెస్
ఆప్షన్ 2 : జియో హాట్ స్టార్, లయన్ గేట్, ఫ్యాన్ కోడ్ డిస్కవరీ ప్లస్
ఆప్షన్ 3: జియో హాట్ స్టార్, సన్ నెక్స్ట్, కంచ లంక, హోయ్ చోయ్
వీటిలో ఏదైనా ఒక ఆప్షన్ ను ఎంచుకుని సూచించిన ఓటిటీ ప్లాట్ ఫామ్ యాక్సెస్ అందుకోవచ్చు.
Also Read: Motorola Edge 70 : సూపర్ స్లిమ్ డిజైన్ మరియు జబర్దస్త్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
ఇది జియో అందించిన వన్ ఇయర్ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు 365 అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5జి డేటా, 4జి నెట్ వర్క్ పై డైలీ 2.5 జీబీ డేటా మరియు డైలీ 100 SMS బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో రూ. 35,100 విలువైన 18 నెలల జెమినీ AI ప్రో యాక్సెస్ కూడా ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ తో జియో హాట్ స్టార్ 3 నెలల యాక్సెస్, జియో టీవీ మరియు జియో ఎఐ క్లౌడ్ యాక్సెస్ కూడా అందిస్తుంది.