JIO హ్యాపీ న్యూ ఇయర్ 2020 ప్లాన్స్ ఇతర ప్లాన్స్ కంటే ఎక్కువ ప్రయోజాలను ఇస్తాయి

HIGHLIGHTS

సరికొత్త అన్లిమిటెడ్ బంపర్ అఫర్లను ప్రకటించింది.

టెలికం రంగంలో ప్రస్తుతం ఎదుర్కుంటున్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా అన్ని టెలికం సంస్థలు గట్టి పోటీని మరియు గడ్డుకాలాన్ని చవిచూడాల్సివస్తోంది. అయితే, రిలయన్స్ జియో మాత్రం 2020 నూతన సంవత్సర కానుకగా "2020 Happy New Year Offer"  వినుత్నమైన మరియు సరికొత్త అన్లిమిటెడ్ బంపర్ అఫర్లను ప్రకటించింది. ఈ అఫర్లు, రూ.199 మొదలుకొని 2020 రుపాయల ధరలో వస్తుంది. కానీ, ఈ ప్లాన్ తీసుకొచ్చే ప్రయోజాలను మాత్రం బోలెడన్ని అని చెప్పొచ్చు.

2020 Happy New Year Offer : ప్రయోజనాలు

ఈ 2020 Happy New Year Offer ని ఎంచుకునే స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు పూర్తిగా ఒక సంవత్సరానికి గాను అన్లిమిటెడ్ సర్వీస్ అందుతుంది. ఈ అన్లిమిటెడ్ అఫర్ విషయానికి వస్తే, మీ స్మార్ట్ ఫోను యొక్క నంబరుకు 365 రోజుల వ్యాలిడిటీతో డైలీ 1.5 GB  డేటా మరియు జియో నుండి జియో కి అన్లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది. ఇక Non-Jio అంటే ఇతర నెట్వర్క్ కాలింగ్ విహాసినికి వస్తే, ఈ పూర్తి వ్యాలీడీటీకి గాను 12,000 నిముషాల FUP లిమిట్ తో కాలింగ్ అఫర్ చేస్తోంది. అలాగే, డైలీ 100 SMS లను కూడా అందిస్తోంది.

ఇక ఇదే విధంగా, 28 రోజు నుండి మొదలుకొని 365 రోజులు అంటే, ఒక నెల మొదలుకొని 1 సంవత్సరం వరకూ ఈ హ్యాపీ న్యూయార్ లో భాగంగా చేసింది మరియు ఇవి ఎక్కువ డేటా ప్రయోజనాలను మరియు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి రూ.199, రూ.399, మరియు రూ.555 రూపాయల ధరతో వస్తాయి.

జియో హ్యాపీ న్యూ ఇయర్ రూ. 199 ప్లాన్

ఈ జియో హ్యాపీ న్యూ ఇయర్ రూ. 199 ప్లాన్ వినియోగదారులకు రోజుకు 1.5 GB డేటాతో మొత్తంగా 42GB ల హై స్పీడ్ డాటాతో ని ఇస్తుంది. ఇక Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు మరియు 1000 ఆఫ్ నెట్ మినిట్స్ ని కూడా అఫర్ చేస్తోంది. వీటితో పాటుగా,  డైలీ 100 SMS ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

జియో హ్యాపీ న్యూ ఇయర్ రూ. 399 ప్లాన్

ఈ జియో హ్యాపీ న్యూ ఇయర్ రూ. 399 ప్లాన్ వినియోగదారులకు రోజుకు 1.5 GB డేటాతో మొత్తంగా 84GB ల హై స్పీడ్ డాటాతో ని ఇస్తుంది. ఇక Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు మరియు 2000 ఆఫ్ నెట్ మినిట్స్ ని కూడా అఫర్ చేస్తోంది. వీటితో పాటుగా,  డైలీ 100 SMS ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

జియో హ్యాపీ న్యూ ఇయర్ రూ. 555 ప్లాన్

ఈ జియో హ్యాపీ న్యూ ఇయర్ రూ. 555 ప్లాన్ వినియోగదారులకు రోజుకు 1.5 GB డేటాతో మొత్తంగా 126GB ల హై స్పీడ్ డాటాతో ని ఇస్తుంది. ఇక Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు మరియు 3,000 ఆఫ్ నెట్ మినిట్స్ ని కూడా అఫర్ చేస్తోంది. వీటితో పాటుగా,  డైలీ 100 SMS ల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :