Jio Google: జియో యూజర్లకు 35 వేల విలువైన Gemini Pro AI ఉచితంగా ప్రకటించింది.!

HIGHLIGHTS

జియో మరో కొత్త ఆశ్చర్యకరమైన ఆఫర్ ని తన యూజర్ల కోసం ప్రకటించింది

రూ. 35,100 రూపాయల విలువైన 18 నెలల Google Gemini Pro AI యాక్సెస్ ఉచితం

రిలయన్స్ జియో యూజర్లకు Google One యాక్సెస్ ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది

Jio Google: రిలయన్స్ జియో, టెలికాం నెట్వర్క్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి ఏ పని చేసినా కొత్తగా మరియు ఆశ్చర్యపరిచే విధంగా చేయడం పరిపాటిగా మారింది. ఈరోజు కూడా జియో మరో కొత్త ఆశ్చర్యకరమైన ఆఫర్ ని తన యూజర్ల కోసం ప్రకటించింది. రూ. 35,100 రూపాయల విలువైన 18 నెలల Google Gemini Pro AI యాక్సెస్ ని జియో కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్నట్లు జియో ఈ రోజు ప్రకటించింది. అయితే, ఈ ప్లాన్ అందుకోవడానికి అందరూ అర్హులు కాదు దీనికి ఏజ్ లిమిట్ సెట్ చేసింది. మరి రిలయన్స్ జియో కొత్తగా ప్రకటించిన ఈ ఆఫర్ కి అర్హులు ఎవరూ మరియు ఈ ప్లాన్ వివరాలు ఏమిటో క్లియర్ గా తెలుసుకుందామా.

Jio Google : Gemini Pro AI

రిలయన్స్ జియో చాలా రోజులుగా గూగుల్ భాగస్వామ్యంతో కొనసాగుతోంది. ఇప్పుడు ఈ భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తూ అద్భుతమైన ఆఫర్ ని రిలయన్స్ జియో యూజర్ల కోసం అందించింది. అదేమిటంటే, రూ. 35,100 రూపాయల విలువైన 18 నెలల Google Gemini Pro AI యాక్సెస్ ని రిలయన్స్ జియో యూజర్లకు ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ ఆఫర్ ని ఇప్పటికే అందుబాటులోకి కూడా తీసుకువచ్చింది.

ఈ ఉచిత Gemini Pro AI కి అర్హులు ఎవరు?

జియో అన్లిమిటెడ్ 5G ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. కానీ ప్రస్తుతానికి ఈ ఆఫర్ కోసం కేవలం 18 నుంచి 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారికి మాత్రమే అర్హత ఉన్నట్లు ప్రకటించింది. అంటే, 18-25 వయసు కలిగి జియో అన్లిమిటెడ్ 5G ప్లాన్ రీఛార్జ్ చేసిన యూజర్లకు గూగుల్ జెమినీ కంప్లీట్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.

ఇది ఎలా పొందాలి?

my Jio App ద్వారా ఈ ఆఫర్ ను అందుకోవచ్చు. దీనికోసం ముందుగా మీ జియో నెంబర్ తో లాగిన్ అవ్వాలి. తర్వాత, హోమ్ పేజ్ పైన గూగుల్ జెమినీ ఆఫర్ బ్యానర్ కోసం చూడండి. ఈ బ్యానర్ పై క్లిక్ చేసి మీ Gmail మెయిల్ ఐడి ద్వారా ఈ ఆఫర్ ని క్లెయిమ్ చేసుకోండి.

Also Read: గొప్ప డిస్కౌంట్ తో 7 వేల బడ్జెట్ లో లభిస్తున్న PHILIPS Dolby సౌండ్ బార్.!

ఈ ఆఫర్ తో వచ్చే లాభాలు ఏమిటి?

ఈ ఆఫర్ తో గూగుల్ జెమినీ 2.5 ప్రో, 2TB వరకు గూగుల్ వన్ స్టోరేజ్ యాక్సెస్, VEO 3.1 AI వీడియో టూల్ యాక్సెస్, గూగుల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ టూల్ notebookLM యాక్సెస్ మరియు సూపర్ ఇమేజ్ క్రియేటర్ నానో బనానా వంటి వాటికి ఉచిత యాక్సెస్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ అందుకుంటే మీ గూగుల్ ఫోటో స్టోరేజ్ గురించి అస్సలు చింతించాల్సిన అవసరం ఉండదు.

మీరు కూడా జియో యూజర్ అయ్యుండి, మీ వయసు 18 నుంచి 25 సంవత్సరాలు ఉంటే మై జియో యాప్ చెక్ చేయండి. మీ అకౌంట్ లో గూగుల్ జెమినీ బ్యానర్ కనుక ఉంటే వెంటనే ఈ ఉచిత యాక్సెస్ అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :