Jio Gemini Offer: ఇప్పుడు జియో యూజర్లు అందరికీ గూగుల్ AI యాక్సెస్ ఉచితం.!

Updated on 19-Nov-2025
HIGHLIGHTS

Jio Gemini Offer యాక్సెస్ కేవలం 18 నుంచి 25 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికి మాత్రమే ఆఫర్ చేసింది

లిమిట్ ను ఎత్తి వేసి అన్లిమిటెడ్ 5జి ప్లాన్ కలిగిన యూజర్లకీ గూగుల్ AI యాక్సెస్ ఉచితంగా అందిస్తున్నట్లు జియో అనౌన్స్ చేసింది

రూ. 35,100 విలువైన 18 నెలల గూగుల్ జెమినీ ప్రో యాక్సెస్ ఇప్పుడు జియో కస్టమర్లకు అందరికీ ఉచితం

Jio Gemini Offer: గూగుల్ యొక్క ప్రీమియం జెమినీ యాక్సెస్ యూజర్లకు ప్రకటించిన విషయం అందరికీ తెలుసు. అయితే, ఈ యాక్సెస్ కేవలం 18 నుంచి 25 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికి మాత్రమే ఆఫర్ చేసింది. కానీ ఇప్పుడు ఈ లిమిట్ ను ఎత్తి వేసి అన్లిమిటెడ్ 5జి ప్లాన్ కలిగిన యూజర్లు అందరికీ గూగుల్ AI యాక్సెస్ ఉచితంగా అందిస్తున్నట్లు జియో అనౌన్స్ చేసింది. అంటే, రూ. 35,100 విలువైన 18 నెలల గూగుల్ జెమినీ ప్రో యాక్సెస్ ఇప్పుడు జియో కస్టమర్లకు అందరికీ ఉచితంగా అందించింది.

Jio Gemini Offer: కొత్త అప్‌డేట్

రిలయన్స్ జియో మరియు గూగుల్ భాగస్వామ్యంతో భారతీయ యూజర్లకు ఉచిత గూగుల్ జెమినీ ప్రో యాక్సెస్ ప్లాన్ అందించాయి. ముందు కేవలం 18 నుంచి 25 సంవత్సరాల లోపు వయసు కలిగిన యువత కోసం మాత్రమే ఈ ఉచిత యాక్సెస్ అందించింది. అయితే, ఈరోజు నుని ఈ వయోపరిమితి ఎత్తివేస్తూ అందరికీ ఈ ఉచిత యాక్సెస్ అందిస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

ఈ ఆఫర్ ను ఈరోజు నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కూడా జియో అనౌన్స్ చేసింది. అయితే, యాప్ లో ఈ ఆఫర్ నవంబర్ 21 నుంచి Claim చేసుకోవచ్చని కొందరికి జియో యాప్ నోటిఫై చేసింది. ఈ యాక్సెస్ క్లెయిమ్ చేసుకునే యూజర్లకు రూ. 35,100 విలువైన 18 నెలల గూగుల్ జెమినీ ప్రో యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.

Jio Gemini Offer : లాభాలు ఏమిటి

ఈ యాక్సెస్ అందుకునే యూజర్లు 2TB వరకు గూగుల్ వన్ స్టోరేజ్ యాక్సెస్ అందుకుంటారు. అంటే, మీ జీమెయిల్ మరియు గూగుల్ ఫోటోస్ వంటి వాటికి ఉచితంగా 2TB వరకు స్టోరేజ్ లభిస్తుంది. Veo 3.1 పై హై క్వాలిటీ వీడియో క్లిప్స్ క్రియేట్ చేసే అవకాశం లభిస్తుంది. అంతేకాదు, డీప్ రీసర్చ్ వంటి ప్రీమియం ఫీచర్స్ కి యాక్సెస్ కూడా వస్తుంది. గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన జెమిని 3 మోడల్ కూడా ఈ ఉచిత ఆఫర్ లో భాగంగా మీకు అందుతుంది. టోటల్ గా గూగుల్ జెమినీ ప్రో AI పూర్తి యాక్సెస్ మీకు ఉచితంగా అందుతుంది.

Also Read: BSNL Super Plan: ఒక్కసారి రీఛార్జ్ చేయండి సంవత్సరం మొత్తం ఆనందించండి.!

ఈ ఆఫర్ ఎవరికి అందుతుంది?

రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న అన్లిమిటెడ్ 5జి ప్లాన్స్ తో రీఛార్జ్ చేసే యూజర్లు అందరికీ ఈ గూగుల్ జెమినీ ప్రో AI పూర్తి యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. మీరు కూడా జియో అన్లిమిటెడ్ 5జి ప్లాన్స్ ఉపయోగిస్తున్న యూజర్ అయితే మీకు కూడా ఇప్పుడు ఈ యాక్సెస్ లభిస్తుంది. మై జియో యాప్ నుంచి మీరు ఈ ఉచిత గూగుల్ AI యాక్సెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :