Jio Free offer on Pro Google Gemini now available for all unlimited plan users
Jio Free offer: టెలికాం ఇండస్ట్రీ లో కొనసాగుతున్న గట్టి పోటీ కి అనుగుణంగా రిలయన్స్ జియో సూపర్ ఆఫర్ అందించింది. అదేమిటంటే, రిలయన్స్ జియో యొక్క నెంబర్ తో అన్లిమిటెడ్ 5G ప్లాన్స్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు రూ. 35,100 విలువైన Pro Google Gemini యొక్క 18 నెలల యాక్సెస్ ఉచితంగా ప్రకటించింది. ఈ ఆఫర్ రెండు నెలలుగా అందుబాటులో ఉన్నా ఏజ్ లిమిట్ ఉండటంతో ఈ లిమిట్ పరిధిలో లేని వారు ఈ ఆఫర్ అందుకోలేక పోయారు. అయితే, ఇప్పుడు జియో ఈ ఆఫర్ పై విధించిన ఏజ్ లిమిట్ తొలగించి అందరికీ ఈ 18 నెలల ఉచిత ఆఫర్ ని అందించింది.
రిలయన్స్ జియో ఇటీవల అందించిన గూగుల్ జెమిని AI ప్రో ఉచిత యాక్సెస్ గురించే మనం ఇప్పుడు చర్చించుకుంటుంది. ఈ ఆఫర్ విడుదల చేసినప్పుడు కేవలం 18 నుంచి 25 సంవత్సరాలు కలిగిన వారికి మాత్రమే అని జియో కండిషన్ పెట్టింది. అయితే, రెండు రోజుల క్రితం నవంబర్ 19వ తేదీ నుంచి ఈ వయోపరిమితి తీసివేసి 18 సంవత్సరాలు పైబడిన అందరికీ ఉచితంగా ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫీచర్ ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ ఉచిత గూగుల్ జెమినీ AI ప్రో ఆఫర్ అందుకోవాలంటే, జియో అన్లిమిటెడ్ ప్లాన్స్ రీఛార్జ్ చేయాలి. అంటే, జియో అన్లిమిటెడ్ ప్లాన్ యూజర్లకు మాత్రమే ఈ ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
రిలయన్స్ జియో యొక్క అన్ని అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్స్ తో ఈ ఉచిత ఆఫర్ ని జత చేసింది. అంటే, రూ. 349 రూపాయల నుంచి ప్రారంభమయ్యే ప్లాన్ పై ఈ ఉచిత ఆఫర్ లభిస్తుంది. ఈ పరిధిలో 14 ప్రీపెయిడ్ ప్లాన్స్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.
Also Read: ఈరోజు మంచి బడ్జెట్ ధరలో లభిస్తున్న 5.1 Dolby Audio సౌండ్ బార్ డీల్స్ ఇవే.!
గూగుల్ జెమినీ ప్రో Ai యాక్సెస్ తో మీకు గూగుల్ జెమినీ ప్రీమియం యాక్సెస్ లభిస్తుంది. ఇందులో నానో బనానా ప్రో ఇమేజ్ క్రియేటర్, హై క్వాలిటీ వీడియోలు క్రియేట్ చేసే Veo 3.1 యాక్సెస్, గూగుల్ డీప్ రీసెర్చ్, సినిమాటిక్ ఫిలిం మేకింగ్ టూల్ Flow, ఇమేజ్ నుంచి వీడియో క్రియేట్ చేసే Whisk యాక్సెస్ మరియు NotebookLM వంటి మరిన్ని ఫీచర్స్ ఈ గూగుల్ జెమినీ యాక్సెస్ తో అందుకోవచ్చు. 218 నాలా పాటు ఈ అన్ని ఫీచర్స్ కూడా ఉచితంగా పొందవచ్చు.