Jio Extra Data: కొత్త ప్లాన్స్ పైన అధనపు డేటా అనౌన్స్ చేసిన జియో.!

Jio Extra Data: జియో యూజర్ల కోసం గొప్ప ఆఫర్ లను ప్రకటించింది. రిలయన్స్ జియో ఇటీవల తీసుకు వేసిన 3 కొత్త ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ పైన ఎక్స్‌ట్రా డేటాని ఆఫర్ చేస్తోంది. ఇందులో 6GB ఎక్స్‌ట్రా డేటా మొదలుకొని 78GB ల అధనపు డేటా అందించే ప్లాన్స్ కూడా ఉన్నాయి. జియో కొత్తగా ఎక్స్‌ట్రా డేటా ప్రకటించిన ప్లాన్స్ మరియు ఆ ప్లాన్స్ అందించే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా.

Jio Extra Data Plans

రిలయన్స్ జియో కొత్తగా తీసుకు వచ్చిన జియోటీవీ ప్రీమియం ప్లాన్స్ అయినరూ. 398, రూ. 1,198 మరియు రూ. రూ. 4,498 ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన ఈ ఎక్స్‌ట్రా డేటాని ఆఫర్ ని జత చేసింది.

జియో రూ. 398 ప్లాన్

ఈ జియో ప్లాన్ 28 Days వ్యాలిడిటీతో వస్తుంది మరియు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2 GB 4జి డేటా మరియు 6GB ఎక్స్‌ట్రా డేటాతో టోటల్ 62GB డేటాని మరియు డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో 28 రోజుల పాటు 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటాని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో 12 OTT లకు ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

Jio prepaid Plan

Also Read: Redmi Buds 5: హైబ్రిడ్ ANC తో కొత్త వైర్లెస్ బడ్స్ లాంఛ్ చేస్తున్న రెడ్ మి.!

జియో రూ. 1,198 ప్లాన్

జియో రూ. 1,198 ప్లాన్ ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ తో 14 OTT లకు ఉచిత యాక్సెస్ + 18 GB ఎక్స్‌ట్రా డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ తో 84రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS ప్రయోజనం కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా 2 GB 4జి డేటా మరియు 5జి నెట్ వర్క్ ఆపిన అన్లిమిటెడ్ 5జి డేటా లాభాలను అందుకోవచ్చు.

జియో రూ. 4,498 ప్లాన్

ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది మరియు పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 5జి నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటా ఆనందాన్ని కూడా అందుకోవచ్చు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 4జి నెట్ వర్క్ పైన డైలీ 2 GB డేటా మరియు 78 GB ఎక్స్‌ట్రా డేటాను కూడా పొందుతారు. అలాగే, 100 SMS/day ప్రయోజనం మరియు 14 OTT లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :