Jio Diwali Dhmaka : సరికొత్త అఫర్లను ప్రకటించిన jio

HIGHLIGHTS

my jio.com హోమ్ పేజీలో తన సరికొత్త దీపావళి ఆఫర్ "Jio Diwali Dhmaka" ని ప్రకటించిన జియో

ఈ దీపావళి సందర్భంగా తన సరికొత్త ప్లాన్లను jio ప్రకటించింది. ఇందులో భాగంగా Jio Phone2 ఓపెన్ సేల్ జరగనుంది మరియు paytm తో కొనుగోలు చేయడం ద్వారా 200 రూపాయల క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అలాగే, ఇటీవలే విడుదల చేసిన 100% క్యాష్ బ్యాక్ అఫర్ మరియు వార్షిక ప్లాన్ అయినటువంటి Rs 1,699 ప్లాన్ కూడా ఇందులో భాగంగా చేసింది. 2200 తక్షణ క్యాష్ బ్యాక్ ఆఫర్ –  jio అనుభందంగా, ఏదైనా 4G ఫోన్ కొనుగోలు చేయడం ద్వారా 2200 రూపాయల తక్షణ క్యాష్ బ్యాక్ అందిస్తోంది jio. అయితే, దీనిని పొందడం కోసం 198/299 ప్లాన్ రీఛార్జ్ చేయవలసివుంటుంది. అలాగే, ఈ కాష్ బ్యాక్ 50 రూపాయల విలువగల 44 వోచర్ల రూపంలో అందిస్తుంది.        

Wallets Partner Offers

ప్రస్తుతం, ప్రధాన డిజిటల్ వాల్లెట్స్ అయినటువంటి Paytm, PhonePe, Amazon Pay మరియు MobiKwik వంటి వాటిపైన మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్లు కేవలం 1నవంబర్ నుండి 15నవంబర్ వరకు మాత్రమే అందిబాటులో ఉంటుంది. డిజిటల్ వాల్లెట్స్ పైన ఈ కొత్త రీచార్జి ఆఫర్లను అందిస్తోంది జియో.

 1. Paytm-   కొత్త వినియోగదారులకి  –  NEW JIO కోడ్ తో – Rs 30 మరియు ఇప్పటికేవున్న వినియోగదారులకి – PAYTMJIO -Rs 20 మరియు వీటితో పాటుగా పేటిఎమ్ మాల్లో 600 పైన ఆర్డర్ చేయడం ద్వారా 200 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

2. PhonePe – కొత్తగా రీఛార్జ్ చేసే వినియోగదారులు – Rs 100 మరియు ఇప్పటికేవున్న వినియోగదారులు – Rs 25 పొందవచ్చు దీనితో రీఛార్జ్ చేయడంతో.

3. Amazon Pay – కొత్తగా రీఛార్జ్ చేసే వినియోగదారులు – Rs 75 మరియు ఇప్పటికేవున్న వినియోగదారులు – Rs 30 పొందవచ్చు దీనితో రీఛార్జ్ చేయడంతో.

4. MobiKwik – కొత్తగా రీఛార్జ్ చేసే వినియోగదారులు super cash Code ఇంటువంటి 'JIOPLAN' తో – Rs 300 మరియు ఇప్పటికేవున్న వినియోగదారులు కూడాఅదే కోడ్ తో MobiKwik తో రీఛార్జ్ చేయడం ద్వారా  Rs 300 క్యాష్ పొందవచ్చు. 

Jio Phone Festive Gift Card

ఈ దీపావళికి బహుమతిగా మీకు ప్రియమైన వారికీ ఇవ్వడానికి ఈ గిఫ్ట్ కార్డు బాగుంటుందని, జియో తన అఫర్ ద్వారా చెబుతోంది. ఈ కార్డు కొనుగోలు చేయడానికి my jio.com లేదా my jio App ద్వారా బుక్ చేయవలసి ఉంటుంది. అయితే, దీనిని మీరు కోరుకున్న అడ్రెస్స్ కి పంపించడానికి 99 రూపాయల షిప్పింగ్ ఛార్జ్ కూడా సమర్పించుకోవలసి ఉంటుంది. దీనిని,  మై జియో స్టోర్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ఫ్రెష్ మరియు రిలయన్స్ స్మార్ట్ స్టోర్లలో వాడుకోవచ్చు. ఈ జియో ఫోన్ గిఫ్ట్ కార్డులు12 నెలల చెల్లుబాటుతో అందిస్తున్నారు మరియు వీటి వాడుకపైన ఎటువంటి అధిక మైన ఛార్జిలు ఉండవని చెబుతోంది.                       

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :