reliance jio to develop 6g core says senior vice president
Jio 6G: అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ జియో, ఫ్యూచర్ నెట్వర్క్ కోసం సొంతం 6జి కోర్ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో 5G నెట్ వర్క్ విస్తరణతో దూసుకుపోతున్న జియో, అదే వేగంతో 6జి ని కూడా ఆచరణలోకి తీసుకొచ్చే పనులో పడినట్టు కనిపిస్తోంది. 6వ తరం (6G) టెక్నాలజీ యొక్క రీసర్చ్ మరియు డెవలప్మెంట్ కోసం రిలయన్స్ జియో విస్తృతంగా పనిచేస్తున్నట్లు కొత్త నివేదిక తెలిపింది.
రిలయన్స్ జియో, 60% విస్తృతంగా పనిచేస్తుంది. దేశంలో సొంత టెక్నాలజీతో 6వ తరం (6G) టెక్నాలజీని విస్తరించడానికి 6G కోర్ ని సిద్ధం చేస్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది. దేశంలో అంతరాయం లేని తరువాత తరం నెట్వర్క్ ను అందించడానికి Jio Platforms Limited (JIL) నిరంతరం కృషి చేస్తున్నట్లు జియో ఇప్పటికే తెలియజేసింది.
Also Read: Price Cut: లేటెస్ట్ షియోమి 5G ఫోన్ పైన భారీ తగ్గింపు అందుకోండి.!
ఎప్పటి వరకు 6G వాడుకలోకి వస్తుంది అనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేనప్పటికీ, జియో అతి త్వరలోనే ఈ సేవలను అందిస్తుందని అంచనా వేస్తున్నారు. 5G అత్యంత వేగంతో విస్తరిస్తున్న రిలయన్స్ జియో 6G సేవలను కూడా అంతే వేగంతో తీసుకొస్తుందని కూడా అంచనా వేస్తున్నారు.
అయితే, https://www.jio.com/platforms/technology/6g/ పేజ్ నుండి ఈ అప్ కమింగ్ టెక్నాలజీ ఉపయోగం మరియు దానికోసం కంపెనీ చేస్తున్న కృషిని గురించి అప్డేట్స్ ను అందిస్తోంది. ఈ పేజ్ ద్వారా జియో 6G కోసం జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్ (JIL) తీసుకు రావడానికి చూస్తున్న ఈ టెక్నాలజీ విశిష్టతను కూడా వివరిస్తోంది.
అయితే, కొత్తగా వచ్చిన నివేదిక ద్వారా జియో 6G నెట్ వర్క్ కోసం సొంత 6G కోర్ ను ను సమకూర్చుకుంటున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది.