జియో క్రికెట్ : Live క్రికెట్ మ్యాచ్ తో పాటుగా అనేక బహుమతులు గెలుచుకునే అవకాశం

HIGHLIGHTS

ఈ ఆటను ఆడే ప్లేయర్లు ఎవరైతే ట్రివియా ప్రశ్నలకు సరైన సమాధానాలను ఎంచుకుంటారో, వారికీ మంచి పాయింట్లు లభిస్తాయి.

మార్చి 23 నుండి మే 5 వరకు జరగనున్న IPL సందర్భంగా, జియో కూడా తన "ఖేలో క్రికెట్ జియో క్రికెట్" ని అందిస్తోంది. దీని జియో వినియోగదారులతో పాటుగా, ఇతరులు కూడా ఆదుకునే అవకాశాన్ని జియో అందించింది. ఈ జియో క్రికెట్ నుండి Live స్కోర్స్ మరియు ముందస్తు అంచనాలకు సంభందించిన ప్రశ్నలకు సరైన సమాధానాలను అందించినవారూ కొన్ని పాయింట్లను గెలుచుకోవచ్చు. అధనంగా, ఈ ఆటను ఆడే ప్లేయర్లు ఎవరైతే ట్రివియా ప్రశ్నలకు సరైన సమాధానాలను ఎంచుకుంటారో, వారికీ మంచి పాయింట్లు లభిస్తాయి.

మీరు గనుక ఒక జియో వినియోగధారులైతే, ఆప్ స్టోర్ నుండి మీ యొక్క My Jio app అప్డేట్ చేసుకోవాల్సివుంటుంది. అప్డేట్ చేసుకున్నవారికి ఈ కొత్త ఎంపిక  వెంటనే లభిస్తుంది. ఒక వేళా మీరు గనుక జియో వినియోగదారులు కాకపోయినట్లైయితే, మీ నంబరును జియో కి అందించడంతో ఒక OTP లభిస్తుంది. దీనితో, జియో వినియ్ప్గదారులు కానివారు కూడా ఈ జియో క్రికెట్ ఆడుకోవచ్చన్నమాట.

ఇందులో ఒక 3 ఓవర్ల ను ఎంచుకునే పవర్ ప్లే ఆడడం ద్వారా పవర్ కార్డ్స్ గెలుచుకోవచ్చు. ఈ ప్వార కార్డుతో ఎక్కువ పాయింట్లను మీరు గెలుచుకునే అవకాశం ఉంటుంది. మరొక మంచి విషయం ఏమిటంటే, ఈ ఆటను మీకు నచ్చిన భాషలో ఎంచుకునే అవకాశం కూడా అందించింది.కాబట్టి, మీకు నచ్చిన బసహాను ఎంచుకుని మీరు ఈ ఆటను ఆడవచ్చు. అదనంగా, మేరే థర్డ్ ఎంపైర్ అవతారం ఎత్తవచ్చు , ట్రివియాలో మీకు అందించిన థర్డ్ ఎంపైర్ పెండింగ్ డెషిషన్ కు అందించిన ఎంపికలో,  మీరు ఎంచుకున్న ఎంపిక సరైనదయితే మరిన్ని పాయింట్లను కూడా గెలుచుకోవచ్చు.

ఈ పాయింట్లలో ఏమిటి లాభం :

ఈ అతని ఆడతాం, పాయింట్లను కూడా గెలుచుకుంటాం మరి వీటితో మాకేంటి లాభం? ఇదేనా మీ ప్రశ్న. ఇప్పటి వరకు దినికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ  చింతించకండి, ఈ ఆటలతో మీరు గెలుచుకున్న పాయింట్లను మీ జియో ఆప్ ద్వారా రిడీమ్ చేసుకునే అవకాశం, జియో అందించవచ్చని తెలుస్తోంది. అంతేకాకుండా, మరికొన్ని ఆశ్యర్యపరిచే బహుమతులను కూడా ఈ పాయింట్లతో అందించవచ్చని అంచనావేస్తున్నారు. అయితే, వీటిపైనా ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కాబట్టి, ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సి ఉంటుంది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :