jio cheapest prepaid plan with 12 ott and data benefits
Jio ధమాకా: 12 OTTలు మరియు డేటా కేవలం కేవలం రూ. 148 కే అందుకోండి అంటోంది జియో. ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ ను మరింతగా విస్తరించే కార్యక్రమంలో భాగంగా రిలయన్స్ జియో కొత్త ఎంటర్టైన్మెంట్ ప్లాన్ లను తీసుకు వచ్చింది. ఈ ప్లాన్ లను రూ. 148 రూపాయల నుండి మొదలుకొని రూ. 4,498 రూపాయల వరకూ అందించింది. వీటిలో అతి తక్కువ ధరలో వచ్చిన బడ్జెట్ ప్లాన్ సైతం 12 ఓటీటీల యాక్సెస్ తో పాటుగా డేటా వంటి అన్ని లాభాలను అందిస్తోంది.
రిలయన్స్ జియో ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ నుండి బడ్జెట్ ధరలో అధిక లాభాలను అందించే Jio ధమాకా ప్లాన్ గా ఈ రూ. 148 ప్లాన్ గురించి ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ జియో ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ హై స్పీడ్ డేటా మరియు 12 ఓటీటీలకు సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ అందించే కంప్లీట్ ప్రయోజనాలను ఈ క్రింద చూడవచ్చు.
జియో రూ. 148 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ తో కాలింగ్ మరియు SMS ప్రయోజనాలు వర్తించవు. అయితే, ఈ బడ్జెట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ తో 28 రోజులకు గాను 10GB హై స్పీడ్ 4G డేటా జియో అందిస్తోంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో 12 ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.
Also Read : Direct 2 Mobile: ఇక నేరుగా స్మార్ట్ ఫోన్ ల లోనే ఎంటర్టైన్మెంట్ ప్రసారాలు..!
ఇక రూ. 148 ప్లాన్ తో జియో అందిస్తున్న 12 ఓటీటీల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో Sony LIV, జీ5, జియోసినిమా ప్రీమియం, Liongate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal, Docubay, EPIC ON మరియు Hoichoi లకు JioTV app ద్వారా యాక్సెస్ ను అందిస్తుంది.