జియో బంపర్ అఫర్ : ఎంపిక చేసిన వినియోగదారులకి, రోజువారీ 2GB డేటా ఉచితం

HIGHLIGHTS

రిలయన్స్ జియో, కొంత మంది వినియోగదారుల కోసం Jio Celebrations Pack ని పొడిగించింది.

రిలయన్స్ జియో, కొంత మంది వినియోగదారుల కోసం Jio Celebrations Pack ని పొడిగించింది. దీని ప్రకారం, ఈ టెలికం సంస్థ ఎంపికచేసిన కొంతమంది వినియోగదారులకి రోజువారీ 2GB ఉచిత డేటాని 5 రోజుల వరకూ అందిస్తుంది. అంటే, ఎంపికచేసిన ఈ వినియోగదారులకు 5 రోజులకుగాను మొత్తంగా 10GB GB డేటాని ఉచితంగా అందుకుంటారు. ఈ సెలబ్రేషన్ ప్యాక్ ని 2018, సెప్టెంబర్ నెలలో తీసుకువచ్చింది జియో. ఈ ఉచిత డేటా, తమకు అందుబాటులో ఉన్నదా, లేదా అని తెలుసుకోవడానికి వినియోగదారులు, వారి MyJio ఆప్ తనిఖీ చేయవచ్చు.

ఈ అఫర్ కోసం, ఎంపికచేసిన ఈ వినియోగదారులకు అందించిన రోజువారీ 2GB అధిక డేటా యొక్క ఓచరును క్రెడిట్ చేసుకోవచ్చు. Myjio ఆప్ లోని MyPlan విభాగంలోకి వెళ్లి వారి ప్లాను యొక్క క్రింది భాగంలో జియో సెలబ్రేషన్ ప్యాక్ కనిపిస్తున్నది లేనిది చూడవచ్చు.  ఇక్కడ ఈ సెలబ్రేషన్ ప్యాక్ ని ఎప్పటివరకూ Resume చేసుకోవచ్చనే విషయాన్నీ కూడా చూడవచ్చు.

ఈ జియో సెలబ్రేషన్ ప్యాక్, జియో యొక్క రెండవ వార్షికోత్సవం సందర్భంగా తీసుకొచ్చింది మరియు గరిష్టంగా 10GB డేటా వరకూ అందించింది. అలాగే, దీపావళి సందర్భముగా జియో దివాళీ ధమాఖా ఆఫరును తీసుకొచ్చింది. ఇందులోభాగంగా, 149 రూపాయల కంటే అధికమైన రీచార్జితో 100% కాష్ బ్యాక్ ని అందించింది.                                       

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :