Jio Budget 5G Plan which offers 72 days unlimited benefits under rs 800
Jio Budget 5G Plan: టారిఫ్ రేట్లు పెరిగిన తర్వాత రీఛార్జ్ చేయడం పెనుభారంగా మారింది. అందుకే, రిలయన్స్ జియో యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు కొన్ని తీసుకు వచ్చింది. వీటిలో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ బడ్జెట్ ధరలో ఎక్కువ రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి. వాటిలో ఒక ప్లాన్ రూ. 800 కంటే తక్కువ ధరలో 72 రోజులు అన్లిమిటెడ్ 5G డేటా మరియు కాలింగ్ తో సహా అన్ని మరిన్ని లాభాలు అందిస్తుంది.
రిలయన్స్ జియో ఇటీవల తీసుకు వచ్చిన రూ. 749 రూపాయల అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ 72 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది మరియు బడ్జెట్ ధరలో వస్తుంది. ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
జియో యొక్క రూ. 749 ప్రీపెయిడ్ ప్లాన్ 72 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 72 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. అలాగే, జియో ట్రూ 5G నెట్ వర్క్ పై 72 రోజులు అన్లిమిటెడ్ 5జి డేటా ని కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 4జి నెట్ వర్క్ పై రోజుకు 2GB డేటా మరియు 20GB అదనపు డేటాతో కలిపి 72 రోజులకు గాను మొత్తంగా 164 GB డేటా అందిస్తుంది.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కూడా అన్ని జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ మాదిరిగానే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కూడా జియోక్లౌడ్, జియో సినిమా మరియు జియో టీవీ లకు ఉచిత యాక్సెస్ అందిస్తుంది.
Also Read: Smart Tv Deal: 32 ఇంచ్ టీవీ రేటుకే 42 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోండి.!
మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి మరియు మొబైల్ రీఛార్జ్ కోసం Click Here