Jio Big Offer: మూడు నెలల పాటు 14 OTT లు మరియు 18 Extra డేటా అందించే బెస్ట్ ప్లాన్.!
రిలయన్స్ జియో యూజర్ల కోసం గొప్ప ప్లాన్
అధిక లాభాలను అందించే Jio బెస్ట్ ప్లాన్
14 OTT లు మరియు 18GB Extra డేటా అందించే బెస్ట్ ప్లాన్
Jio Big Offer: రిలయన్స్ జియో తన యూజర్ల కోసం ఇటీవల గొప్ప ప్లాన్ ఒకటి అందించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ మూడు నెలల పాటు 14 OTT లు మరియు 18GB Extra డేటా అందించే బెస్ట్ ప్లాన్ గా చెప్పబడుతుంది. జియో ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలను తెలుసుకోండి.
SurveyJio Big Offer
రిలయన్స్ జియో కొత్తగా అందించిన రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే ఇప్పుడు చెబుతోంది. ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా, ఎక్స్ ట్రా డేటాతో పటు మరిన్ని లాభాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం.
Also Read: iQOO Neo9 Pro: విడుదలకు ముందే Pre-Book మరియు ఆఫర్లు అనౌన్స్ చేసిన కంపెనీ.!
జియో రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్
జియో రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ తో 84 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS బెనిఫిట్ ను కూడా అందిస్తుంది. ఈ జియో రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ తో 84 రోజుల పాటు డైలీ 2GB 4G డేటా లభిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో 28 రోజులకు 6GB చొప్పున 18GB ఎక్స్ ట్రా డేటాని కూడా అందిస్తుంది. అదే 5జి నెట్ వర్క్ పైన అయితే 84 రోజుల పాటు Unlimited 5G డేటాని అందిస్తుంది.
ఈ ప్లాన్ తో 90 రోజుల పాటు డిస్ని+ హాట్ స్టార్ మొబైల్, 84 రోజుల ప్రైమ్ వీడియో మొబైల్ మరియు 84 రోజుల జియోసినిమా ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను తీసుకు వస్తుంది. ఇది మాత్రమే కాదు Sony LIV, ZEE5, Lionsgate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal, Docubay, EPIC ON మరియు Hoichoi లకు కూడా మూడు నెలల సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile