#image_title
Unlimited లాభాలను మరియు Prime Video ఉచితంగా ఆఫర్ చేసే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ను Jio తన యూజర్ల కోసం అందించింది. రిలయన్స్ జియో లేటెస్ట్ గా అందించిన వన్ ఇయర్ బెస్ట్ ప్లే తో అన్ని ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా మరియు డైలీ SMS లను పూర్తిగా సంవత్సరం మొత్తం అందించే ఈ ప్లాన్ అమేజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను కూడా పూర్తిగా వన్ ఇయర్ అందిస్తుంది. రిలయన్స్ జియో అందించిన ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఏమిటో చూద్దామా.
రిలయన్స్ జియో కొత్తగా తీసుకు వచ్చిన రూ. 3,227 లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటోంది. జియో యొక్క ఈ బెస్ట్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ తో పాటుగా మరొక బెస్ట్ వన్ ఇయర్ ప్లాన్ కూడా వుంది. ఆ ప్లాన్ అన్లిమిటెడ్ లాభాలతో పాటుగా వన్ ఇయర్ Disney+Hotstar మొబైల్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. ఈ రెండు బెస్ట్ ప్లాన్స్ అందించే పూర్తి ప్రయోజనాలను ఈ క్రింద చూడవచ్చు.
రిలయన్స్ జియో యొక్క ఈ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది మరియు పూర్తి చెల్లుబాటు కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. ఈ ప్లాన్ తో 4G నెట్ వర్క్ పైన డైలీ 2GB లిమిటెడ్ డేటా 5G నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లిమిట్ మరియు Jio Tv, Jio Cinema (ప్రీమియం కాదు) మరియు Jio Cloud లకు ఫ్రీ యాక్సెస్ అందిస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ తో అమేజాన్ ప్రైమ్ వీడియో యొక్క వన్ ఇయర్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ కూడా అందుతుంది.
Also Read : Amazon Big Deal: ఎప్పుడూ లేనంత చవక దరకే OnePlus 10R 5G.!
రిలయన్స్ జియో యొక్క ఈ ప్లాన్ కూడా వన్ ఇయర్ (365) రోజులవ్యాలిడిటీతో వస్తుంది మరియు పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ తీసుకు వస్తుంది. ఈ జియో ప్లాన్ తో 4G నెట్ వర్క్ పైన డైలీ 2GB లిమిటెడ్ డేటా, 5G నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ తో డైలీ 100 SMS లిమిట్ తో పాటుగా Jio Tv, Jio Cinema (ప్రీమియం కాదు) మరియు Jio Cloud లకు ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది. అంతేకాదు, ఈ జియో ప్లాన్ తో Disney+Hotstar Mobile వన్ ఇయర్ సబ్ స్క్రిప్షన్ కూడా కస్టమర్లకు లభిస్తుంది.