డైలీ 3GB హై స్పీడ్ డేటాతో jio బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

HIGHLIGHTS

ఆన్లైన్ వర్క్

ఆన్లైన్ క్లాస్ లేదా ఎంటర్టైన్మెంట్

విషయం ఏదైనా కూడా డేటా అవసరం అవుతుంది

ప్రస్తుతం, ఎక్కువ డేటా అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ ని వినియోగదారులు ఎక్కువ ఇష్టపడుతున్నారు.  ఆన్లైన్ వర్క్, ఆన్లైన్ క్లాస్ లేదా ఎంటర్టైన్మెంట్ విషయం ఏదైనా కూడా డేటా అవసరం అవుతుంది. ఇవి మాత్రమే కాదు, OTT ప్లాట్ఫారం నుండి కంటెంట్ ను ఆస్వాదించాలన్నా కూడా ఇంటర్నెట్ వినియోగం కోసం డేటా అవసరం. అందుకే, జియో యొక్క డైలీ 3GB హై స్పీడ్ అందించే బెస్ట్ ప్లాన్స్ గురించి చూద్దాం.                                 

Jio 3GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్

జియో వినియోగదారులకు 3 జిబి రోజువారీ డేటా పరిమితిని ఇచ్చే 3 ప్లాన్స్ ను కలిగి ఉంది మరియు వ్యాలిడిటీ  కాకుండా మరికొన్ని ఇతర లాభాలను తీసుకొస్తుంది. ఆ బెస్ట్ ప్లాన్స్ ఈ క్రింద చూడవచ్చు.

Jio Rs 401 Plan:

 ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు రోజుకు 3 జిబి డేటాను అదనంగా మొత్తం 6 జిబి డేటాను కలగలిపి పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను మొత్తం డేటాను 90 GB డేటాని తీసుకువస్తుంది. ఇది రోజుకు 100 SMS లు, అపరిమిత కాలింగ్ మరియు ఈ ప్యాక్‌తో వినియోగదారులు అదనపు ఖర్చు లేకుండా రూ .399 విలువైన 1 సంవత్సర డిస్నీ + హాట్ స్టార్ చందాకు కూడా యాక్సెస్  పొందుతారు.

Jio Rs 999 Plan

ఈ ప్లాన్ దానితో 84 రోజుల చెల్లుబాటు, రోజుకు 3 జిబి డేటా (చెల్లుబాటు వ్యవధికి మొత్తం 252 జిబి డేటాను ఇస్తుంది), రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందుకుంటారు.   

Jio Rs 349 Plan

ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో, రోజుకు 3 జిబి డేటా (చెల్లుబాటు వ్యవధికి మొత్తం 84 జిబి డేటాను ఇస్తుంది), రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు,అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందుకుంటారు.   

మరిన్ని Jio Best Plans కోసం ఇక్కడ నొక్కండి. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :