Jio: రూ.399 కే టాప్ 3 OTT యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ తెచ్చే బెస్ట్ ప్లాన్..!!

Jio: రూ.399 కే టాప్ 3 OTT యాప్స్ కి ఉచిత సబ్ స్క్రిప్షన్ తెచ్చే బెస్ట్ ప్లాన్..!!
HIGHLIGHTS

Netflix, Prime Video, మరియు డిస్ని+ హాట్ స్టార్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్

ఈ జియో ప్లాన్స్ కేవలం నెలకు రూ.399 రూపాయల నుండి ప్రారంభమవుతాయి

OTT ప్లాట్‌ఫారమ్స్ యొక్క ఉచిత సబ్ స్క్రిప్షన్ ను అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్

ప్రతి నెలా ప్రముఖ OTT ప్లాట్ ఫామ్స్ అయిన Netflix, Prime Video, మరియు డిస్ని+ హాట్ స్టార్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కావాలా? అయితే, జియో అఫర్ చేస్తున్న బెస్ట్ ప్లాన్ లను ఎంచుకుంటే సరిపోతుంది. ఈ జియో ప్లాన్స్ కేవలం నెలకు రూ.399 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. మారుతున్న కాలాన్నిబట్టి ప్రజలు సీరియల్స్ నుండి కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను చూడ్డానికే మొగ్గుచూపుతున్నారు. అందుకే, ప్రతి ఒక్కరూ కూడా OTT ని ప్లాట్ ఫామ్స్ ఎంచుకుంటున్నారు. అటువంటి వారికోసం జియో కూడా Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని+ హాట్ స్టార్ మూడు OTT ప్లాట్‌ఫారమ్స్ యొక్క ఉచిత సబ్ స్క్రిప్షన్ ను అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్ అందించింది.

అయితే, ఇవి ప్రీపెయిడ్ ప్లాన్ మాత్రం కాదు. ఈ ప్లాన్ లను కేవలం పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం మాత్రమే అందించింది. రూ.399 ప్లాన్ వీటిలో బెస్ట్ అని చెప్పొచ్చు మరియు ఈ ప్లాన్ అధిక డేటా అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాబాలాను అందిస్తుంది.

Jio రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

జియో యొక్క ఈ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఒక నెల రెంటల్ ప్లాన్ మరియు ఇది బిల్ వ్యవధికి గాను 75 GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS లిమిట్ కూడా వుంది. ఈ ప్లాన్ తో Netflix, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్ని+ హాట్ స్టార్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా పొందుతారు. అంతేకాదు, మీరు 200 GB వరకు డేటాని రోల్ అవుట్ కూడా చేసుకోవచ్చు. అయితే, బిల్ తో 18% GST కూడా జతచేయబడుతుంది మరియు ఇది గమనించగలరు.    

ఇదే లాభాలను అఫర్ చేసే మరొక రెండు ప్లాన్స్ ని కూడా అందించింది. ఇవి మీ ఫ్యామిలీ ప్లాన్స్ మరియు ఈ ప్లాన్స్ మీకు అధనపు SIM కార్డ్ ను కూడాతీసుకువస్తాయి. అందులో ఒకటి రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మరియు మరొకటి రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్. వీటిలో రూ.599 ప్లాన్ 1 సిమ్ కార్డ్ తో వస్తుంది. రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మాత్రం 2 అదనపు సిమ్ కార్డ్ లను తీసుకువస్తుంది.

మరిన్ని జియో బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo