Jio Best Plans: రూ. 500 లోపలే జియో ఆఫర్ చేస్తున్న New ప్రీపెయిడ్ ప్లాన్స్.!

HIGHLIGHTS

జియో యూజర్లకు రూ. 500 లోపలే జియో ఆఫర్ చేస్తున్న New ప్రీపెయిడ్ ప్లాన్స్

ప్రతి ఒక్కరూ అధికంగా వినియోగించే బడ్జెట్ Jio Best Plans

అధిక లాభాలను ఇచ్చే జియో బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్

Jio Best Plans: రిలయన్స్ జియో యూజర్లకు రూ. 500 లోపలే జియో ఆఫర్ చేస్తున్న New ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి మనం ఈరోజు చూడనున్నాము. ప్రతి ఒక్కరూ అధికంగా వినియోగించే బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను జియో ఎక్కువగా ఆఫర్ చేసింది మరియు ఈ బడ్జెట్ ధర లోనే అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మరియు మరిన్ని ఇతర లాభాలను కూడా జతచేస్తోంది. అందుకే, యూజర్లకు అధిక లాభాలను ఇచ్చే జియో బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన ఒక లుక్కేద్దాం.

Jio Best Plans under Rs. 500

Reliance జియో రూ. 500 రూపాయల లోపల చాలానే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది. వీటిలో, రూ. 259, రూ. 328 మరియు రూ. 388 అన్లిమిటెడ్ ప్లాన్స్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ మూడు ప్లాన్స్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.

జియో రూ. 259 ప్లాన్

జియో యూజర్లకు నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ గా ఈ జియో రూ. 259 ప్లాన్ గురించి చెప్పవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా నెల రోజులు వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ తో నెలంతా అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS మరియు రోజుకు 1.5GB డేటాని అందుకోవచ్చు. అంతేకాదు, 5జి నెట్వర్క్ ఉన్న ఏరియాలో Unlimited 5G Data ని వినియోగించుకోవచ్చు. JioTV మరియు JioCinema లకు ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

Also Read : Gold Price: విపరీతంగా పెరిగిన బంగారం ధర..New Price తెలిస్తే షాక్ అవుతారు.!

జియో రూ. 328 ప్లాన్

ఈ జియో రూ. 328 ప్లాన్ యూజర్లకు 28 రోజులు అన్లిమిటెడ్ లాభాలను మరియు ప్రముఖ OTT ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. ఈ ప్లాన్ తో 28 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS మరియు రోజుకు 1.5GB డేటాని కూడా అందుకోవచ్చు. అలాగే, 5జి నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లో Unlimited 5G Data ప్రయోజనం కూడా అంధిస్తుంది. అంతేకాదు, DISNEY+HOTSTAR 3 నెలల సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తోంది.

జియో రూ. 328 ప్లాన్

జియో రూ. 388 ప్లాన్ కూడా 28 రోజులు అన్లిమిటెడ్ లాభాలతో పాటుగా ప్రముఖ OTT ప్రయోజనాన్ని కూడా తీసుకు వస్తుంది. ఈ ప్లాన్ 28 కూడా రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు 28 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS అను అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో జియో రోజుకు 2GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది.మీరు 5జి నెట్వర్క్ ఉన్న ప్రాంతాల్లో ఉన్నవారైతే Unlimited 5G Data ప్రయోజనాన్ని పొందవచ్చు. అలాగే, DISNEY+HOTSTAR 3 నెలల సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తోంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :